రోజూ మూడు పూటలా అన్నం తింటే లావు అయిపోతాము. అదిగో ఆ ఆలోచన నుంచి మనకి దిగుమతి అయిందే, ఉదయం పూట అవగాహనం పేరిట టిఫిన్లు తినటం. పాత కాలంలో మన పెద్దలు అయితే పొద్దుగాల్నే, శరీరానికి మంచి పోషకాలను ఖండపుష్టిని ఇచ్చే ఆహారాన్ని తీసుకునేవాళ్ళు. అందులో ముఖ్యంగా పెరుగులో సద్దన్నం, జొన్న గటక, రాగి సంగటి పోషకాల పరంగా వెలకట్టలేని ఆహారాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత అందరూ మూడు పూటలు అన్నం తినటం అలవాటు అయ్యింది. ఇలా కొద్ది కాలం నడిచిన తర్వాత లైఫ్ స్టైల్ ఛేంజ్ అయ్యి పొద్దున్నే అన్నం తింటే లావు అయిపోతాం అనే ఫీలింగ్ వచ్చేసింది. అన్నం మానేసి టీ, కాఫీ తాగితే ఆకలిని చంపేయోచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు జనాలంతా. అలాగే టిఫిన్స్ అయిన ఇడ్లీ, దోశ, వడ ఇలాంటివి తినటం వలన కూడా ఆకలి చచ్చిపోతుందట. అంతే కాదు ఇవి రోజు తినటం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు గానీ, రోజూ అత్యంత భారమైన ఈ ఆయిల్ ఫుడ్ తినకూడదు. ఉదయం కొద్దిగా మజ్జిగ లేదా పెరుగుతో లైగా తినాలట. అలాగే మధ్యాహ్నానానికి బిర్రుగా కడుపు నిండా తినాలి.
అలాగే నైట్ కూడా తేలికగా తినటం వలన ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది ఉపవాసం ఉంటారు. అంటే రాత్రివేళ అన్నం మానేస్తారు. అటువంటి అలవాట్లు ఉన్నవాళ్ళు ఆ సమయంలో ఇడ్లీ, దోశ, బోండాలు, చపాతీ, పరోటాలు వంటివి లాగిచ్చేస్తుంటారు. కానీ అలా చేయటం వలన సాధారణంగా అన్నం తిన్న దానికంటే ఎక్కువ శరీరానికి నష్టం కలుగుతుంది. నైట్ పండ్లను తినాలి కానీ ఇప్పుడు అందరూ టిఫిన్స్‌ను ఫలహారాలు అని తినేస్తున్నారు.
అయితే మిగతా టిఫిన్స్‌తో పోలిస్తే ఇడ్లీ మంచిదే. కానీ దీంట్లో సాంబారు, అల్లం చట్నీ, కారం, నెయ్యి ఇలా అన్నిటిని కలిపి తినటం వలన కడుపులో యాసిడిటీ పెరిగిపోతుంది. అలాగే బియ్యం కంటే మినపప్పు లో ఎక్కువ కాలరీలు ఉంటాయి. ఇవి షుగర్‌ను పెంచుతాయి. ఇలా ప్రతి రోజు టిఫిన్స్ తినడం వలన పేగులు తన శక్తిని కోల్పోతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుంది. వాత వ్యాధులు, కీళ్ల నొప్పులు ఇలాంటివి వస్తాయి. కాబట్టి వారానికి ఒకటి రెండు సార్లే టిఫిన్స్‌ను పరిమితం చేయాలి. ఉదయం వేళ పెరుగన్నం ఇంకా రాత్రి మిగిలిన అన్నాన్ని పెరుగులో కలిపి పెట్టుకొని మార్నింగ్ తినటం. లేదంటే మొలకెత్తిన గింజలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి తినటం అలవాటు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పులు గమనించొచ్చు. మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కానీ నిత్యం ఇడ్లీ, దోస, వడ. పూరి, పరోటలాంటివి దీర్ఘకాలంగా తింటే పది పదిహేను ఏళ్లుగా తింటున్న వారికి షుగర్ వ్యాధి వచ్చేస్తుంది.