Daggubati Purandeswari: బీజేపీపై దుష్ప్రచారం.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోంది.. అయినా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె.. నెల్లూరు రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.. అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని బీజేపీపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.
Read Also: Telangana Elections 2023: కాంగ్రెస్ కు షాక్.. కారెక్కిన కత్తి కార్తీక..
Also Read
- PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్‌పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
- Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షాకాజ్ నోటీసులు
- Ashish Banerjee Death: మాజీ డిప్యూటీ స్పీకర్ అనుమానాస్పద మృతి.. పార్టీ ఆఫీస్‌లో ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం
- 2027 ODI World Cup: వన్డే ప్రపంచకప్ తేదీలో మార్పులు? ఆ రోజే తొలి మ్యాచ్.. పూర్తి వివరాలు ఇవే..
ఇక, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానన్నారు పురంధేశ్వరి.. నెల్లూరులో రైల్వే స్టేషన్ ను 102 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఆధునికీకరిస్తోందని తెలిపారు. రైల్వే స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నారు.. పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. నీటిపారుదల.. రహదారుల నిర్మాణంతో పాటు నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు బీజేపీ ఆంధ్రపదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. కేంద్రం నిధులతో చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలను పురంధేశ్వరి పరిశీలిస్తూ వస్తోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Newtons 3rd Law OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీకి సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్‌పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
-
Suriya : ఒకప్పడు వరుస ప్లాప్స్.. ఇప్పుడు 3నెలల్లో రెండు బ్లాక్ బస్టర్స్
-
Gandhari: కళ్లకు గంతలతో తాప్సీ హై-ఇంటెన్సిటీ యాక్షన్.. మహాభారతం స్ఫూర్తితో వస్తున్న ‘గాంధారి’..
-
Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్‌తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!