NTV Telugu Site icon

Daggubati Purandeswari: 22న సెలవు ప్రకటించాలి.. పురంధేశ్వరి డిమాండ్‌

Purandeswari

Purandeswari

Daggubati Purandeswari: ప్రతి ఊరిలోనూ ఇప్పుడు రాముడి ఫీవర్, ఎక్కడ చూసినా రామనామ జపమే. తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం పది రోజులుగా రామాలయాలన్నీ రామ నామంతో హోరెత్తిపోతున్నాయి.. రామ భజనలు చేయడం, భక్తులకు భోజనాలు పెట్టడం, అక్షింతలు సేకరించడం ఇలా ఊరు ఊరునా రాముడి గురించే చర్చ జరుగుతోంది. అయితే, అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట రోజు ఆంధ్రప్రదేశ్‌లో సెలవుగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు బీజేపీ నేతలు.. సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దీంతో.. రాష్ట్రంలో ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.. అయితే, ఏపీలో 21వ తేదీ వరకు మాత్రమే సెలవు ప్రకటించారు.. 22వ తేదీన దేశం మొత్తం చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు సెలవు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆ రోజు సెలవు ప్రకటించలేదని దుయ్యబట్టారు బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి..

Read Also: Devara: అనిరుధ్ కారణంగానే దేవర డిలే?

రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటమని పేర్కొన్న పురంధేశ్వరి.. ఈ నెల 22వ తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారు. 21వ తేదీ వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వెనక దురుద్దేశం ఉందని అర్థం అవుతుందని విమర్శించారు. 22వ తేదీన కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నా.. ఉద్దేశపూర్వకంగానే ఆరోజు సెలవు ఇవ్వలేదన్న ఆమె.. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయని గుర్తుచేశారు. ఇక, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ వల్ల 21వ తేదీ వరకు సెలవు ఇవ్వడాన్ని బీజేపీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల వారికి మోడీ చేయూతను ఇచ్చారని తెలిపారు. అయితే, 22న బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం వీక్షించేందుకు దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అయోధ్య ఘట్టం అందరూ తిలకించేలా ఏపీ ప్రభుత్వం 22వ తేదీనన సెలవు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి.