Site icon NTV Telugu

Purandeswari: కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతోంది..

Purandeshwari

Purandeshwari

పార్వతీపురం మన్యం జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పర్యటించారు. ముందుగా ఆమె టిడ్కో ఇళ్ళను పరిశీలించారు. ఆ తర్వాత కార్యకర్తల సమావేశం అయ్యాకా.. మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్పొరేషన్ల పేరుతో వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతోంది అని విమర్శలు గుప్పించారు. నిధులు కేంద్రం ప్రభుత్వానివి స్టీక్కర్స్ రాష్ట్ర ప్రభుత్వనివి.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కేంద్రం ప్రభుత్వం నిధులతో అమలు జరుగుతోంది అని పురంధేశ్వరి వెల్లడించారు.

Read Also: IPL 2024 Auction: ఐపీఎల్‌ 2024 వేలం డేట్, టైమ్, లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

మేము జనసేన పార్టీతో కలిసి పని చేస్తున్నాం.. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీతో పొత్తులపై కేంద్రంలోని పెద్దలదే తుది నిర్ణయం.. రాష్ట్రంలో బీజేపీనే ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. మన్యం జిల్లాలో సాగునీటి, తాగునీటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.. టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు అని ఆమె విమర్శలు చేశారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలి.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా దీవించాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.

Exit mobile version