Site icon NTV Telugu

Daggubati Purandeswari : ల్యాండ్ లెవెలింగ్ చేయటానికి కూడా నిధులు దోచేశారు

Daggubati Purandeswari

Daggubati Purandeswari

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ కార్యాలయంను రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, పరిశీలకుడు సిద్ధార్థ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు పార్టీ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జగన్ కాలనీల్లో అవినీతి ఉందన్నారు. ల్యాండ్ లెవెలింగ్ చేయటానికి కూడా నిధులు దోచేశారని, మడ అడవులు అడవుల్లో జగనన్న కాలనీల నిర్మాణం ఎలా జరిపారన్నారు.

Vetukuri Suryanarayana Raju : ఆనాడు జనసంఘ్ రద్దు చేసి.. జనతా పార్టీని ప్రారంభించారు

22 లక్షలు ఇళ్ళు కేంద్ర మంజూరు చేస్తే మూడున్నర లక్షలు మాత్రమే నిర్మించారని ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్ పరిధిలో ఏడుగురు అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు పురందేశ్వరి. కాకినాడ రాజమండ్రి కలిపేస్తామని ఇక్కడి నాయకులు అలవిగాని వాగ్దానాలు చేశారని, రాజమండ్రి పార్లమెంటు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు. నా పార్లమెంట్ పరిధిలో ఉన్న ఇద్దరు జనసేన అభ్యర్థులు, టిడిపి అభ్యర్థులతో కలిపి పని చేస్తానని, కేంద్ర నిధులతో ఫ్లైఓవర్ అభివృద్ధి జరిగిందన్నారు. నందమూరి తారక రామారావు బిడ్డగా మీ ముందుకు వచ్చానని, అనపర్తి అభ్యర్థి విషయం కేంద్ర కమిటీ చూసుకుంటుందని ఆమె వ్యాఖ్యానించారు.

Kishan Reddy: పార్టీ ఫిరాయింపులు మీద తప్ప గ్యారంటీల మీద దృష్టి లేదు.. సీఎంపై కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Exit mobile version