NTV Telugu Site icon

Purandeswari: చంద్రబాబు అరెస్ట్‌పై పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు..

Purandeshwari

Purandeshwari

Purandeswari: ఏపీ స్కిల్‌ డెవపల్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది.. అయితే, ఈ కేసుపై మరోసారి స్పందించిన బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబుపై కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, విచారణ చేస్తున్నది సీఐడీ.. అసలు ఈ వ్యవహారంలో కేంద్ర ప్రమేయం ఎక్కడ ఉంటుంది..? అని ప్రశ్నించారు.. ఇక, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిస్తే బాగుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చెప్పారు.. జాతీయ పార్టీగా మా అధినాయకత్వం పొత్తులపై నిర్ణయం తీసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు..

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

మరోవైపు.. రాష్ట్రంలో మద్యం సహా ఇతర అక్రమాలు మీద కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు పురంధేశ్వరి.. మద్యం అమ్మకాలు మీద ఒక కమిటీ ని రాష్ట్రానికి పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానని వెల్లడించారు. ఇక, మహిళా బిల్లును సాధ్యం చేసిన ఘనత నరేంద్ర మోడీ సర్కారు దేనంటూ ప్రశంసలు కురిపించారు పురంధేశ్వరి. కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.. హైకోర్టు తన క్వాష్‌ పటిషన్‌ కొట్టివేయడంతో.. సుప్రీంకోర్టులో ఈ రోజు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు.. సోమవారం రోజు దానిపై విచారణ జరిగే అవకాశం ఉంది.

Show comments