Site icon NTV Telugu

Daggubati Purandeswari : బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టాం

Purandeshwari

Purandeshwari

బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టామన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందులో అంతర్భాగంగా గావ్ ఛలో అభియాన్ పేరుతో దేశంలో ఉన్న ఏడున్నర లక్షల పల్లెల్లో పర్యటిస్తామని ఆమె వెల్లడించారు. త్వరలో వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నామని ఆమె తెలిపారు. ఏపీలోని ప్రతి పల్లెను బీజేపీ కార్యకర్తలు సందర్శిస్తారన్నారు. పల్లెకు పోదాంలో భాగంగా ఏపీలో ఉన్న 21 వేల గ్రామాల్లో పర్యటనలు ఉంటాయని ఆమె అన్నారు. పల్లెకు పోదాంలో భాగంగా ఏపీలో ఉన్న 21 వేల గ్రామాల్లో 24 గంటల పాటు అక్కడ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉంటారని పురందేశ్వరి తెలిపారు.

Summer: మండుతున్న ఎండలు.. గ్రేటర్‌లో నగరవాసుల ఉక్కిరిబిక్కిరి

అక్కడ స్థితిగతులు తెలుసుకుంటూ.. పరిస్థితులను అంచనా వేస్తారన్నారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని రాష్ట్ర నాయకత్వానికి అందజేస్తారని తెలిపారు. ఈ అంశాలన్నిటిని జాతీయ నాయకత్వానికి నివేదిక రూపంలో అందజేస్తామన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ గ్రామాలకు వెళ్తున్నారని.. వారందరికీ పురందేశ్వరి అభినందనలు తెలిపారు. పల్లె ప్రజల పాట్లు తెలుసుకుని పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

 

Exit mobile version