Daggubati Purandeswari: దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అద్భుతమైన మేనిఫెస్టోను విడుదల చేసిందన్నారు రాజమండ్రి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి.. గతంలో మాదిరిగా కాకుండా ప్రజల వద్దకు వెళ్లి ప్రజల అభిప్రాయాలు సలహాలు తీసుకున్న తర్వాత బీజేపీ మేనిఫెస్టో సిద్ధం చేసిందని తెలిపారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన పురంధేశ్వరి.. సుమారుగా కోటి మంది అభిప్రాయాలు తెలుసుకుని వాటన్నింటినీ క్రోడీకరించి మేనిఫెస్టో సిద్ధం చేశామన్నారు. మహిళలు, యువత, సీనియర్ సిటిజన్లు, రైతులను ప్రామాణికంగా తీసుకుని మేనిఫెస్టో సిద్ధం చేశామన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని, ఐదు కోట్ల మంది చిరు వ్యాపారులకు బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిందని పేర్కొన్నారు.
Read Also: Election Commission: లోక్‌సభ ఎన్నికల్లో రూ.4650 కోట్లు స్వాధీనం..ఎన్నికల చరిత్రలో రికార్డ్..
ఇక, తయారీ రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయని, దేశంలో ప్రతిరోజు 30 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు పురంధేశ్వరి.. రోజుకు 14 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌ల నిర్మాణం జరుగుతోందని వివరించారు. రోజుకు 13 శాతం మంది ప్రజలు జీవనపాధి కోసం పట్టణాల వైపు వెళుతున్నారని వివరించారు. మరోవైపు.. రామాయణాన్ని అన్ని దేశాలకు చేరువ చేయాలన్న సంకల్పం చేపట్టామని తెలిపారు. ముద్ర యోజన పథకంలో లోన్లను 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. జమిలి ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న గంజాయి సరఫరా, బ్లేడు బ్యాచ్‌ల దాడులుతో కేంద్రానికి ఏం సంబంధం ఏంటి? అని నిలదీశారు.. ఇక, ముఖ్యమంత్రికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్రాన్ని కాదు.. డీజీపీదే అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు దగ్గుబాటి పురంధేశ్వరి..