NTV Telugu Site icon

Purandeswari: జనసేన-బీజేపీ-టీడీపీ పొత్తు..! పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

Purandeswari

Purandeswari

Purandeswari: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. రాజకీయ వాతావరణం మారిపోతోంది.. ఇప్పటికే ఒంటరిగానే బరిలోకి దిగాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకోగా.. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. తాము వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేస్తామని ప్రకటించింది.. ఆ దిశగా ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఇక, ఇండియా కూటమి.. అంటే కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు కూడా కలిసి పోటీ చేసే విషయంలో చర్చలు జరుపుతున్నాయి. అయితే, జనసేన పార్టీ.. బీజేపీతో ఉందా? లేదా? అనేది మాత్రం ఎటూ తేలడంలేదు.. బీజేపీతో మేం పొత్తులో ఉన్నామని పలు సందర్భాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెబుతూ వచ్చారు.. ఇక, పురంధేశ్వరి కూడా అదే విషయం మరోసారి స్పష్టం చేశారు.

Read Also: YSRCP: వైసీపీ ఇంఛార్జీల మార్పుపై కసరత్తు.. సీఎంవోకు నేతల క్యూ

మేం జనసేనతో పొత్తులో ఉన్నాం.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా అదే చెబుతున్నారని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కానీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో నేను పలానాచోట పోటీ చేస్తానని పార్టీని అడగలేదన్నారు పురంధేశ్వరి.. కానీ, పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానన్నారు. కాగా, గతంలో కూడా బీజేపీ-జనసేన రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయని పవన్‌ చెప్పడం.. జనసేనాని కూడా అదే చెప్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చెబుతున్న విషయం విదితమే.. తమతో తెగదెంపులు చేసుకుంటున్నట్లుగా జనసేన ఎక్కడా చెప్పలేదని.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నామని ఇప్పటికే పురంధేశ్వరి స్పష్టం చేసిన విషయం విదితమే.