కాకినాడ జిల్లా తునిలో తండ్రి దాడిశెట్టి రాజా గెలుపు కోసం తనయుడు దాడిశెట్టి శంకర్ మల్లిక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన తండ్రికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాడు. తునిలో వైసీపీ విజయం అల్రెడీ కన్ఫార్మ్ అయిందని.. కేవలం భారీ మెజార్టీ కోసం ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోట నందూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి దాటిశెట్టి మల్లిక్ ఎన్నికల ప్రచారం చేశాడు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్లీ సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మంచి స్పందన వస్తుందని దాడిశెట్టి రాజాను ఆశీర్వదించాలని కోరుతున్నారు. తునిలో యనమల ఫ్యామిలీకి హ్యాట్రిక్ ఓటమి తప్పదని దాటిశెట్టి శంకర్ మల్లిక్ కౌంటర్ ఇచ్చారు.
Read Also: TS SSC Recounting: టెన్త్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తుకు గడువు మే 15..
ఇక, ఎన్డీయే కూటమి ఇచ్చే అమలు కానీ హామీలు నమ్మవద్దని దాడిశెట్టి రాజా తనయుడు శంకర్ మల్లిక్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఓట్ల కోసం అమలు చేయలేని హామీలతో మీ ముందుకు వస్తున్నారు.. ప్రజలు కాస్తా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మరోసారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తన తండ్రి మంత్రి దాటిశెట్టి రాజాను గెలిపించాలని ఓటర్లను దాటిశెట్టి మల్లిక్ అభ్యర్థించారు.