NTV Telugu Site icon

Daaku Maharaj : డాకు మహారాజ్‎లో ఆ సీన్‎కు సీట్లు చిరగాల్సిందేనట!

Daakumaharaaj

Daakumaharaaj

Daaku Maharaj : నందమూరి బాలకృష్ణ నుండి వస్తున్న తాజా చిత్రం NBK 109. దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌతేలా, ప్రగ్యా జై స్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ సినిమా సంక్రాంతి కానుకగా సందడి చేయనుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ టీమ్​ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను విడుదల చేసింది. ఫుల్​ ఆన్ యాక్షన్ మోడ్​లో ఉన్న ఈ చిత్రం ట్రైలర్ మాస్ ఆడియెన్స్​ను తెగ ఆకట్టుకుంటోంది.

Read Also:Kidney Stones: ఈ కూరగాయలను ఎక్కువగా తీస్తున్నారా? కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు జాగ్రత్త సుమీ

ట్రైలర్ తర్వాత మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ అంతకంతకు మంచి హైప్ ని రేపుతున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన ప్రముఖ ఛాయాగ్రాహకులు విజయ్ కార్తీక్ కన్నన్ ఒక పర్టిక్యులర్ సీన్ నుంచి ఫ్రేమ్ పెట్టి ఈ సీన్ కి తమన్ స్కోర్ తో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ చేశారు. మరి ఆ ఫ్రేమ్ లో బాలయ్య బాబు లుక్ పవర్ఫుల్ గా కనిపిస్తుండగా ఒక మాస్ ఊచకోతే జరిగినట్టుగా కనిపిస్తుంది. మరి డాకు మహారాజ్ లో బాలయ్య విధ్వంసం ఏ రీతిలో ఉంటుందో తెలియాలంటే ఈ సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Read Also:Maharashtra: మేనకోడలు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని.. పెళ్లి భోజనంలో విషం కలిపిన వ్యక్తి..

Show comments