హర్యానాలోని సోనిపట్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో మంగళవారం మంటలు చెలరేగాయి. ఆ సమయంలో.. ఫ్యాక్టరీలో ఉన్న సిలిండర్లు మంటలు అంటుకుని పేలాయి. దీంతో.. మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా కార్మికులు మంటల్లో చిక్కుకుని కాలిపోయారు. అయితే.. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని ఫ్యాక్టరీలో మంటల్లో చిక్కుకున్న కార్మికులను కొంతమందిని రక్షించారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. ఫ్యాక్టరీలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
మంటలు వ్యాపించడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీశారు. ఫ్యాక్టరీలో రబ్బరు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో మంటలు అంటుకున్న క్షతగాత్రులను 16 మంది కార్మికులను సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో పీజీఐకి రిఫర్ చేశారు. మరి కొందరు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. సివిల్ ఆసుపత్రిలో అత్యవసర విధుల కోసం మరికొంత మంది వైద్యులను పిలిపించారు. జిల్లా నలుమూలల నుంచి అంబులెన్స్‌లను రప్పించారు.
Read Also: Smoking: సిగరెట్ తాగే అమ్మాయిల సంఖ్య రెట్టింపు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడి
