Site icon NTV Telugu

Remal cyclone: ఏపీకి తప్పిన ముప్పు.. బెంగాల్‌ వైపు మళ్లిన రెమల్

Cycole Image

Cycole Image

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌కి రెమల్‌గా నామకరణం చేశారు. రుతుపవనాల రాకకు ముందుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫాన్ ఏర్పడింది. అయితే ఈ తుఫాన్‌తో ఏపీకి ఎలాంటి ప్రమాదం లేదు. రెమల్ తుఫాను ఆదివారం పశ్చిమ బెంగాల్‌కు చేరుకోనుంది. దీని ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇది కూడా చదవండి: Ind vs Pak: వామ్మో.. ఒక్క టికెట్ ధర 17 లక్షలు.. ఇండో – పాక్ మ్యాచ్ ..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారనుందని వెల్లడించింది. ఆదివారం నాటికి బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తీరాలకు చేరుకుంటుందని కేంద్ర వాతావరణ శాఖ గురువారం తెలిపింది. శుక్రవారం ఉదయానికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని.. ఇది శనివారం ఉదయం తుఫానుగా మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారనుంది. బంగ్లాదేశ్.. దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుందని భారత వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త మోనికా శర్మ తెలిపారు.

ఇది కూడా చదవండి: Sonia Gandhi: ‘‘ మీ ప్రతీ ఓటు..’’ ఢిల్లీ ఓటర్లకు సోనియా గాంధీ సందేశం..

ఇక ఆదివారం తుఫాన్ తీరం దాటినప్పుడు గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులంతా తిరిగి తీరానికి రావాలని సూచించింది. ఎవరూ వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది. మే 27 వరకు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని సూచించింది. మే 26-27 తేదీల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరం, త్రిపుర, దక్షిణ మణిపూర్‌లోని కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Liquor Truck Overturns: మద్యం లారీ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ ప్రజలు..

Exit mobile version