Cyclone Montha: తీవ్ర తుఫాన్ ముప్పు ముంగిట్లో ఉన్నాయి కోనసీమ, కాకినాడ జిల్లాలు …. కాకినాడకు దక్షిణంగా తీరం దాటవచ్చని తాజాగా అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.. తీరం దాటే సమయంలో 100 – 110 కిలో మీటర్ల గరిష్ట వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. మరో 72 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు.. విద్యుత్, టెలికాం వ్యవస్థపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.. విశాఖ కేంద్రంగా 9 జిల్లాల్లో పరిస్థితి సమీక్షిస్తున్నారు సీనియర్ IAS అజయ్ జైన్.. రాయలసీమ నుంచి అదనపు సిబ్బందిని తుఫాన్ ప్రభావిత జిల్లాలకు తరలిస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు..
Read Also: Viral Video: ఛీ.. ఛీ.. అయ్యప్ప మాల వేసుకొని ఈ గలీజు పనేంటి స్వామి..!
తుఫాను ప్రభావంతో పశ్చిమ గోదావరి తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారుతుంది. రాను రాను తుఫాను తీవ్రత పెరగడంతో జిల్లాలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. రేపు సాయంత్రం తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో వీచే భారీ గాలులకు తీవ్ర నష్టం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడ ప్రాణం నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నరసాపురం తీరప్రాంతానికి ఎన్టీఆర్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొనేందుకు చేరుకున్నాయి. అనుకోని నష్టం జరిగితే ఈ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేస్తాయి.
Read Also: Maa Inti Bangaram: రాజ్ నిడిమోరుతో కలిసి సమంత కొత్త సినిమా పూజ
ఇక, తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై బలంగా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, గాలుల తీవ్రత కారణంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం అయింది. ప్రస్తుతం విపత్తుల నిర్వహణ కేంద్రం నుంచి ఎండీ ప్రఖర్ జైన్ స్వయంగా తుఫాన్ పరిస్థితులను సమీక్షిస్తూ, జిల్లా యంత్రాంగానికి అవసరమైన దిశానిర్దేశాలు జారీ చేస్తున్నారు. తుఫాన్ తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంతాల వద్ద తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో గాలులు తీవ్రంగా వీసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మెంథా తుఫాను నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో అప్రమత్తమయ్యారు నీటి పారుదలశాఖ అధికార యంత్రాంగం.. తాండవ రిజర్వాయర్ లో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు.. ఇన్‌ఫో 250 క్యూసెక్కులున్నా, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యగా 310 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సంకల్పించిన అధికారులు ఆ సంఖ్యను 937 క్యూసెక్కులకు పెంచి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.. తుఫాను నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకుంటున్న పోలీసు యంత్రాంగం.. నాతవరం మండలం, గన్నవరం మెట్ట వద్ద ప్రమాదాలకు కారణం అవుతున్న ఎర్రిగెడ్డకు సమీపంలో కల్వర్ట్ కింద నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న రెండు తాటి చెట్లను గుర్తించి ఆర్ అండ్ బి అధికారుల సహాయంతో తొలగించిన నాతవరం పోలీసులు. అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు..
