Cyclone Mocha : ఇప్పటికే అకాల వర్షాలతో జనం అతలాకుతలం అవుతున్నారు. మళ్లీ పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆందోళన చెందుతున్నారు. మే 6వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఫలితంగా వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడుతుందని అమెరికా వాతావరణ అంచనా వ్యవస్థ గ్లోబల్ వెదర్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్ (జీఎఫ్ఎస్), యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్‌లు (ఈసీఎండబ్ల్యూఎఫ్) అంచనా వేసిన తర్వాతనే ఐఎండీ ఈ ప్రకటన చేసింది. ఈ తుఫానుకు ఐఎండీ ‘మోచా’ అని పేరు పెట్టింది. మోచా అనేది యెమెన్ తన ఎర్ర సముద్రం తీరంలోని ఓడరేవు నగరం పేరు ఈ తుఫానుకు పెట్టారు.
Read Also:MadhyaPradesh : పెళ్లాం కాపురానికి రావట్లేదని బావను చంపిన భర్త
తుఫానును ఎదుర్కొనేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 2019 మే 2న ఒడిశాను తాకిన తుఫానును ప్రస్తావిస్తూ, వేసవిలో తుఫానుల మార్గాన్ని గుర్తించడం కష్టమని పట్నాయక్ అన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనాను, అన్ని శాఖలు, జిల్లాల సమన్వయంతో పనిచేయాలని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యవ్రత్ సాహును నవీన్ పట్నాయక్ ఆదేశించారు. తుఫాను గురించి ఐఎండీ ఇంకా ఎలాంటి అంచనా వేయలేదని భువనేశ్వర్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. అల్పపీడనం తుఫానుగా మారకముందే లోతైన పీడన ప్రాంతంగా మారాల్సి ఉందన్నారు. తుఫాను రాష్ట్రాన్ని తాకితే తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో 24 గంటల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు.
Read Also:Tamilnadu: బీర్ ట్రక్కు బోల్తా.. మందుకోసం మనిషిని వదిలేశారు
