NTV Telugu Site icon

Cyclone Mocha: వచ్చేవారం తూర్పుతీర రాష్ట్రాలకు ‘మోచా’ తుపాను ముప్పు..

Cyclone Mocha

Cyclone Mocha

Cyclone Mocha: అకాల వర్షాల వల్ల ఇప్పటికే పంట నష్టంతో అల్లాడిపోతున్న అన్నదాతలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే వారం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను రానుందని.. ఆగ్నేయ బంగాళఖాతంలో తుపాను బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ఒకవేళ ఈ తుపాను ఏర్పడితే దీనికి మోచా అని పేరు పెట్టనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను బలపడే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది వాతావరణ శాఖ. యెమెన్ దేశంలోన్ పోర్టు నగరమైన మోచా పేరు మీదుగా ఈ పేరు పెట్టినున్నట్లు తెలిపింది. మే 6 నాటికి ఆగ్నేయ బంగాళఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని.. ఆ మరుసటి రోజున అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర వెల్లడించారు.

Read Also: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో ఈడీ తప్పిదం.. ఆప్‌ నేతకు క్షమాపణలు

ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై మే 9 నాటికి తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొన్నారు.అయితే ఆ తుపాను ఉత్తర దిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసినట్లు తెలిపారు. అయితే సాధారణంగా రుతుపవనాలకు ముందు ఏప్రిల్‌-మే-జూన్‌ సీజన్‌లో బంగాళాఖాతం లో తరచూగా తుపానులు ఏర్పడుతాయి. మే నెలలో వీటి ముప్పు మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం తర్వాత తుపాను దిశ గురించి మరింత కచ్చితమైన సమాచారం తెలుస్తుందని తెలిపింది. వచ్చే వారంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు నలభై నుండి యాభై కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.