NTV Telugu Site icon

Cyclone Michaung LIVE UPDATES: ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్‌.. లైవ్ అప్‌డేట్స్‌

Cyclone Michaung

Cyclone Michaung

Cyclone Michaung LIVE UPDATES: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్ దూసుకు వస్తోంది. దక్షిణ కోస్తా వైపు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. రేపు మధ్యాహ్నం కంటే ముందు తీవ్ర తుఫానుగానే తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం నెల్లూరుకు 220కిలోమీటర్ల దూరంలో కొనసాగు తున్న మిచౌంగ్ ఎఫెక్ట్ తో గంటకు 90నుంచి 110కి.మీ గరిష్ట వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. మిచౌంగ్ తీవ్ర తుఫానుతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విమానాల రాకపోకలపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం పడింది. విజయవాడ-విశాఖ ఇండిగో విమానాన్ని అధికారులు రద్దు చేశారు. గాలుల తీవ్రత అధికంగా ఉండటంతో అధికారులు రద్దు చేశారు. తుఫాన్ ప్రభావం ఆధారంగా మరికొన్ని సర్వీస్‌లు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

The liveblog has ended.
  • 04 Dec 2023 09:45 PM (IST)

    14 విమానాలు రద్దు

    * మిచౌంగ్ తుఫాన్ దెబ్బకి గన్నవరం నుంచి విమానాలు రద్దు

    * ఇండిగో నుంచి నడిచే 14 విమానాలు రద్దు

    * విశాఖ, హైదరాబాద్, బెంగుళూరు, షిర్డీలకు కనెక్టింగ్ ఫ్లైట్స్ రద్దు చేసిన ఇండిగో

    * మరో 4 విమానాల రాకపోకలపై ఇంకా రాని క్లారిటీ

  • 04 Dec 2023 07:42 PM (IST)

    స్వర్ణముఖి కాలనీ జలమయం

    నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్కో సిబ్బంది నివాసం ఉండే స్వర్ణముఖి కాలనీ జలమయం అయ్యింది.. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఏరియాలో రెండు అడుగుల మేరకు నిలిచిన వర్షపు నీరు.. లిఫ్ట్ లోకి నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు

  • 04 Dec 2023 07:42 PM (IST)

    నెల్లూరులో 21.82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

    నెల్లూరు జిల్లాలో ఈరోజు ఉదయం 8 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సగటున 21.82 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదు.. అత్యధికంగా ముత్తుకూరు మండలంలో 11.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారుల వెల్లడి.. రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు

  • 04 Dec 2023 07:40 PM (IST)

    విశాఖలో రేపు విద్యాసంస్థలకు సెలవు

    రేపు ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు సెలవు ప్రకటన.. తీవ్ర తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరుసగా రెండో రోజు హాలీడే ప్రకటించిన కలెక్టర్

  • 04 Dec 2023 05:18 PM (IST)

    నిలిచిపోయిన ఫిషింగ్ బోట్లు

    మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో కృష్ణా జిల్లాలో ఫిషింగ్ బోట్లు నిలిచిపోయాయి.. మత్స్య కారులు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.. మచిలీపట్నం పోర్టులో 10వ హెచ్చరిక జారీ చేశారు.. రానున్న 72 గంటలపాటు కీలకమని అధికారులు చెబుతున్నారు.. దీంతో, మంగినపూడి బీచ్ లో భారీగా ఫిషింగ్ బోట్లు నిలిచిపోయాయి.

  • 04 Dec 2023 05:16 PM (IST)

    తిరుమలలో నిండిన జలాశయాలు

    తిరుమలలో ఏడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.. దీంతో జలాశయాలు నిండుకున్నాయి.. 5 జలాశయాలు నిండు కుండలా మారాయి.. ఇవాళ రాత్రికి గోగర్బం డ్యాం గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు అధికారులు

  • 04 Dec 2023 04:41 PM (IST)

    స్వర్ణముఖి నదికి భారీ వదర..

    తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో.. స్వర్ణముఖి నదికి వరద ఉధృతి పెరిగింది.. వాకాడు సమీపంలోని స్వర్ణముఖి బ్యారేజ్ కు భారీగా చేరుతోంది వరద నీరు..

  • 04 Dec 2023 03:47 PM (IST)

    తుఫాన్‌ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం

    తుఫాన్‌ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది ఏపీ ప్రభుత్వం..
    * బాపట్ల – కాటమనేని భాస్కర్‌
    * బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ – జయలక్ష్మి
    * తూర్పు గోదావరి – వివేక్‌ యాదవ్‌
    * కాకినాడ – యువరాజ్‌
    * ప్రకాశం – ప్రద్యుమ్న
    * నెల్లూరు – హరికిరణ్‌
    * తిరుపతి – జె.శ్యామలరావు
    * పశ్చిమ గోదావరి – కన్నబాబు

  • 04 Dec 2023 03:16 PM (IST)

    100 మీటర్ల మేర ముందుకు వచ్చిన సముద్రం..

    మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో మంగినపూడి బీచ్ లో హై అలెర్ట్ ప్రకటించారు.. దాదాపు 100 మీటర్ల మేర ముందుకు వచ్చింది సముద్రం.. దీంతో, సముద్ర తీరానికి రాకపోకలు నిలిపివేశారు అధికారులు.. మరోవైపు తుఫాన్ దెబ్బకి భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. కోడూరు బసవన్న పాలెంలో కరకట్టను తాకాయి సముద్ర అలలు..

  • 04 Dec 2023 02:43 PM (IST)

    పులికాట్ సరస్సుకు భారీగా  వరద నీరు

    తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని పులికాట్ సరస్సుకు భారీగా  వరద నీరు వచ్చి చేరుతోంది. మొన్నపాలెం, పంబలి, పులింజరివారిపాలెం, తానాకట్టు గ్రామాలకు వరద ముప్పు పెరిగింది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులకు సూచించారు.

  • 04 Dec 2023 02:42 PM (IST)

    మిచౌంగ్ తుఫాన్ ఎదుర్కొంటానికి సన్నద్దమైన కృష్ణా జిల్లా యంత్రాంగం

    మిచౌంగ్ తుఫాన్ ఎదుర్కొంటానికి సన్నద్దమైన కృష్ణా జిల్లా యంత్రాంగం

     కృష్ణా కలెక్టర్ రాజాబాబు:-

    గతంలో దివిసీమ ఉప్పెన అంత స్థాయిలోనే మీచౌంగ్ తుఫాన్ వస్తోంది

    అప్పటి పరిస్థితులు, టెక్నాలజీతో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగ్గా ఎదుర్కొనగలం

    8 వేల మంది ఈ తుఫానుకు ఎఫెక్ట్ అవుతారు

    వీరికోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం

    ధాన్యం తడవ కుండా మిల్లర్లకు తరలించాము

    ఎస్పీ జాషువా, కృష్ణా:-

    12 వందల మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టాం

    సిబ్బంది సెలవులు రద్దు చేసి విధుల్లో రావాలని చెప్పాం

    తీరం వెంబడి గస్తీ పెంచి సిబ్బంది ని ఏర్పాటు చేశాం

  • 04 Dec 2023 01:58 PM (IST)

    తీవ్ర తుఫాను బాపట్ల వద్ద తీరం తాకే అవకాశం.

    మిచౌంగ్ తుఫాను ప్రభావం బాపట్ల జిల్లాలో అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు ఆ జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు. తీవ్ర తుఫాను బాపట్ల వద్ద తీరం తాకే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అలెర్ట్ చేశామన్నారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామని ఆయన చెప్పారు.  ఎలాంటి పరిస్థితి నీ ఐనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు రాత్రి నుండి తీరం లో తీవ్ర మైన గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తం గా ఉండాలన్నారు.

  • 04 Dec 2023 01:39 PM (IST)

    నెల్లూరు జిల్లాలోని విద్యా సంస్థలకు రేపు కూడా సెలవు

    నెల్లూరు జిల్లాలో భారీ వర్ష సూచనతో రేపు కూడా నెల్లూరు జిల్లాలోని విద్యా సంస్థలకు  కలెక్టర్ ఎం హరి నారాయణన్ సెలవు ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

  • 04 Dec 2023 01:38 PM (IST)

    చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేలపై భారీగా చేరిన వర్షపు నీరు

    తుఫాన్‌ ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల చెన్నై ఎయిర్‌పోర్టు రన్ వేలపై భారీగా  వర్షపు నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా 14 విమానాలను రద్దు చేశారు. పలు విమానాలను దారి మళ్లించారు.

  • 04 Dec 2023 01:35 PM (IST)

    డేంజర్‌.. తీవ్ర తుపానుగా బలపడిన మిచౌంగ్

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మిచౌంగ్ బలపడింది. రేపు ఉదయం బాపట్ల, దివిసీమ మధ్య  తీవ్రతుపాను తీరం దాటనుంది. తుఫాన్ ప్రభావంతో దివిసీమకు  ఉప్పెన ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ విశ్లేషకులు భయాందోళనకు గురవుతున్నారు. మీటర్ అంత కంటే ఎక్కువ ఎత్తున రాకాసి అలలు విరుచుకుపడి సముద్ర నీరు ముంచెత్తనున్నట్లు సమాచారం. నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో  తీవ్ర తుఫాన్ కొనసాగుతోంది. ఇప్పటికే నెల్లూరులో 20సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. నిజంపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10ను ఐఎండీ జారీ చేసింది. కృష్ణపట్నంలో 8వ నెంబర్....మిగిలిన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.

    తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో తీరం వెంబడి 100నుంచి 110కి.మీ వేగంతో  గాలులు వీయనున్నాయి. తీరం దాటిన తర్వాత కూడా తుఫాన్‌గా మిచౌంగ్ కొనసాగనుంది. దక్షిణ కోస్తాకు రెడ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ.  ఏపీ, తెలంగాణ,చత్తీస్‌గఢ్‌,ఒడిషా,తమిళనాడుపై  మిచౌంగ్ ప్రభావం చూపనుంది.

  • 04 Dec 2023 11:59 AM (IST)

    తుఫాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష

    CM YS Jagan: తుఫాను పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌గా పరిస్థితిని సీఎం జగన్ సమీక్షిస్తున్నారు. తీసుకోవాల్సిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రత్తలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

  • 04 Dec 2023 11:29 AM (IST)

    భయాందోళనకు గురవుతున్న అన్నదాతలు

    విజయనగరం జిల్లా గజపతినగరం, మెంటాడ, బొండపల్లి, దత్తిరాజేరు మండలాల్లో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం భారీగా ఉంది. తుఫాన్ కారణంగా వాతావరణం మారుతోంది. వర్షాలు భారీగా పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుప్పలుగా వేసినా తిప్పలు తప్పవేమోనని వరి రైతులు వాపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోసిన పంటను పొలంలోనే చిన్న చిన్న కుప్పలుగా రైతులు  వేశారు. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో వరి నీట మునిగింది.

  • 04 Dec 2023 11:26 AM (IST)

    తీవ్ర తుఫాను నేపథ్యంలో లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్

    తీవ్ర తుఫాను నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో సాగుతున్న లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది.  తుఫాను కారణంగా రెడ్ అలర్ట్ ఇచ్చినందున పాదయాత్రకు 3రోజుల విరామం ఇచ్చారు.  ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్ద యువగళం పాదయాత్ర జరుగుతోంది. తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా  భారీ వర్షం కురుస్తోంది. భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాను ప్రభావం తగ్గాక ఈనెల 7న మళ్లీ శీలంవారి పాకల నుంచి యువగళం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

  • 04 Dec 2023 11:24 AM (IST)

    తుఫాను ఎఫెక్ట్ అన్నదాతలు ఆందోళన

    అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా  భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వరిచేలు నేలకొరిగాయి. చేతికి అందివచ్చిన పంటలు దెబ్బ తినడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కోనసీమ జిల్లాలో పి. గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, అమలాపురం,అల్లవరం, ఉప్పలగుప్తం, కొత్తపేటతో పాటు అనేక మండలాలలో వరి చేలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

  • 04 Dec 2023 11:22 AM (IST)

    తుఫాను ప్రభావంతో వర్షం కారణంగా పలు విమానాలు రద్దు

    తిరుపతి జిల్లాలో మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో వర్షం కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించక ఆకాశంలోనే చక్కర్లు కొట్టి ల్యాండ్ కానీ ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా విమానాలు అనంతరం స్పైస్ జెట్ విమానం బెంగళూరుకు వెళ్ళింది. ఇండిగో,ఎయిర్ ఇండియా విమానాలు హైదరాబాదుకు పయనమయ్యాయి. ఇకమీదట రావాల్సిన విమానాలన్ని కూడా వాతావరణం అనుకూలించక పోవడం వల్ల విమానాలన్ని రద్దయ్యాయి.  రేణిగుంట విమానాశ్రయం నుండి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు చేసేది లేక వెనుదిరిగారు. ముఖ్య ప్రయాణికులకు విమానాశ్రయ సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

  • 04 Dec 2023 11:18 AM (IST)

    కృష్ణా జిల్లాలోని  7 మండలాల్లో ముందస్తు చర్యలు

    మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో  కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా జిల్లాలోని  7 మండలాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. తుఫాన్ ఎఫెక్ట్ ప్రాంతాల వారి కోసం 57 పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశాయి. మచిలీపట్నం, అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు, బంటుమిల్లి, కృత్తివెన్నులలో తుఫాన్ ఎఫెక్ట్ భారీగా పడింది. 7763 మందికి సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సి ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

  • 04 Dec 2023 11:13 AM (IST)

    నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా  మిచౌంగ్ తుఫాను

    నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా  మిచౌంగ్ తుఫాను కదులుతోంది. గంటకు 14 కి.మీ వేగంతో  తుఫాన్ కదులుతోందని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  డా. బీఆర్‌ అంబేడ్కర్ తెలిపారు.  ప్రస్తుతానికి తుఫాను చెన్నైకి 130 కి.మీ, నెల్లూరుకు 220 కి.మీ, బాపట్లకు 330 కి.మీ, మచిలీపట్నానికి 350కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయిందని చెప్పారు. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా తుఫాన్ పయనించనుంది.  రేపు మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీవ్రతుఫానుగా మిచౌంగ్ తీరం దాటనుంది.

    దీని ప్రభావంతో నేడు,రేపు కూడ కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు కురవనున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.  ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. తీరం వెంబడి గంటకు 55 -75 కీమీ వేగంతో గాలులు వీస్తున్నాయి.  మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని ఆయన సూచించారు.

     

  • 04 Dec 2023 11:07 AM (IST)

    మిచౌంగ్ తుఫాన్‌ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధం

    మిచౌంగ్ తుఫాన్‌ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ఎస్‌. ఢిల్లీ రావు పేర్కొన్నారు. మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు, ఈ కేంద్రం నుంచి తుఫాన్ పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు. జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు అత్యవసర సహాయం, వాతావరణ సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ నంబర్ 0866- 2575833లో సంప్రదించాలని తెలిపారు.

  • 04 Dec 2023 11:03 AM (IST)

    తుఫాన్ కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి..

    తీవ్రమైన మీచాంగ్ తుఫాన్ కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పేర్కొన్నారు.  ముంపునకు గురయ్యే ప్రాంతాలకు చెందిన వారు అక్కడ ఇళ్లను ఖాళీ చేసి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన తుఫాన్ షెల్టర్ నందు సురక్షితంగా ఉండాలన్నారు. సముద్రతీర ప్రాంతాలకు, బీచ్ లకు ఎవరికీ ప్రవేశం లేదని.. పర్యాటకులకు భక్తులకు సముద్రతీర ప్రాంతానికి వెళ్లడం తీవ్ర తుఫాను కారణంగా నిషేధించామన్నారు. సముద్ర తీర ప్రాంత ప్రజలు మరియు ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళవద్దన్నారు. అధిక నీటి ప్రవాహం ఉన్న రోడ్డులు, బ్రిడ్జిలు, వాగులు, నదులు దాటడానికి ఎవరు ప్రయత్నం చేయవద్దన్నారు. బలహీనంగా ఉన్న ఇంటి గోడలు, కరెంటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్స్, చెట్ల కింద ఉండవద్దని.. బలమైన ఈదురు గాలులు వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. మీ సహాయార్థం కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటారన్నారు. ఎల్లవేళలా పోలీసు వారి సహాయం మరియు సేవలు పొందడానికి ఈ కింది ఫోన్ నెంబర్లకు కాల్ చేయాలన్నారు.

  • 04 Dec 2023 11:00 AM (IST)

    కృష్ణా జిల్లాలో పాఠశాలలకు సెలవు

    తుఫాను ప్రభావం దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కృష్ణా జిల్లా  కలెక్టర్ రాజాబాబు సెలవు ప్రకటించారు.  రైతులు తాము పండించిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్లమీద, ఖాళీ ప్రదేశాలలో ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే సంచులలోకి నింపి రైతు భరోసా కేంద్రాల ద్వారా మిల్లులకు తరలించాలని సూచించారు.

  • 04 Dec 2023 10:58 AM (IST)

    దక్షిణ కోస్తా తీరానికి సమీపిస్తున్న మిచౌంగ్ తీవ్ర తుఫాన్

    దక్షిణ కోస్తా తీరానికి మిచౌంగ్ తీవ్ర తుఫాన్ సమీపిస్తోంది. బాపట్ల సమీపంలో రేపు మధ్యాహ్నం తర్వాత  మిచౌంగ్ తీవ్రతుఫాన్ తీరం దాటనుంది. దక్షిణ కోస్తాకు ఐఎండీ రెడ్ వార్నింగ్ అలెర్ట్ ఇచ్చింది.  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 10కి.మీ వేగంతో కదులుతూ  తుఫాన్ బలపడింది. నెల్లూరుకు 190, బాపట్లకు 310కి.మీ దూరంలో మిచౌంగ్ తుఫాన్ కొనసాగుతోంది.

  • 04 Dec 2023 10:56 AM (IST)

    పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలకు సెలవు

    మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఈ ప్రకటన చేశారు. మంగళవారం కూడా సెలవు ప్రకటించారు

  • 04 Dec 2023 10:53 AM (IST)

    సూర్యలంక తీర ప్రాంతంలో ఎగిసిపడుతున్న అలలు

    బాపట్ల జిల్లా సూర్యలంక తీర ప్రాంతంలో అలలు ఎగిసిపడుతున్నాయి. తుఫాను ప్రభావంతో బాపట్ల,  గుంటూరు జిల్లాలో తేలికపాటి జల్లులతో  వర్షం ప్రారంభమైంది. మరోవైపు సూర్యలంక తీర ప్రాంతానికి  18 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ టీం చేరుకుంది. చేపల వేట ముగించుకుని, బోట్ లతో సహా నిజాంపట్నం హార్బర్‌కు మత్స్యకారులు  చేరుకున్నారు.

  • 04 Dec 2023 10:52 AM (IST)

    భారీ వర్షాలకు నెల్లూరు నగరంలోని రహదారులు జలమయం

    భారీ వర్షాలకు నెల్లూరు నగరంలోని రహదారులు జలమయమయ్యాయి.  మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి వద్ద  వర్షపు నీరు అధికంగా చేరింది. బెజవాడ గోపాల్ రెడ్డి సెంటర్లో రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండగా.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అపార్టుమెంట్ సెల్లార్లలోకి నీరు చేరుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తల్పగిరి, నీలగిరి, డ్రైవర్స్ కాలనీల్లో  లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తిరుపతి, విజయవాడ వైపు వెళ్లే బస్సులను మినీ బైపాస్ మీదుగా మళ్లించారు. మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

  • 04 Dec 2023 10:50 AM (IST)

    కాళంగి జలాశయం గేట్లు ఎత్తివేత

    తిరుపతి జిల్లా లో శ్రీకాళహస్తి సమీపంలోని కాళంగి జలాశయానికి  వరద నీరు ఉద్ధృతంగా చేరుతోంది. పూర్తిగా నిండడంతో 10 గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని వి అధికారులు విడుదల చేశారు. దీని ప్రభావంతో కాళంగి నది పరివాహక ప్రాంతాల్లో గ్రామాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉంది. సూళ్లూరుపేట వద్దనున్న జాతీయ రహదారిపై  వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

  • 04 Dec 2023 10:45 AM (IST)

    మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో పలు విమాన సర్వీసులు రద్దు

    విశాఖ: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో పలు విమాన సర్వీసులు రద్దు.. గాలులు తీవ్రత అధికంగా ఉండటంతో ఏటీఆర్ సర్వీస్‌లు నిలిపి వేసిన ఇండిగో..

    రద్దయిన విమాన సర్వీసులు ఇవే..

    *విజయవాడ-విశాఖ

    *విశాఖ-తిరుపతి

    *తిరుపతి-విశాఖ

    *విశాఖ-విజయవాడ

    *చెన్నై-విశాఖ..

    *హైదరాబాద్-విశాఖ

    *విశాఖ-హైదరాబాద్

  • 04 Dec 2023 10:44 AM (IST)

    కపిలతీర్థం పుష్కరిణి వద్ద భక్తులకు అనుమతి నిలిపివేసిన టీటీడి

    తిరుపతి: కపిలతీర్థం పుష్కరిణి వద్ద భక్తులకు అనుమతి నిలిపివేసిన టీటీడి

    తుఫాన్ కారణంగా ఉద్ధృతంగా ఉన్న కపిలతీర్దం జలపాతం

    తుఫాన్ ప్రభావం తగ్గే వరకు భక్తులుకు అనుమతిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ

  • 04 Dec 2023 10:42 AM (IST)

    అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

    మిచౌంగ్ తుఫాన్‌ ప్రభావంతో నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం, రేపు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు స్థానిక సెలవు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు.