Site icon NTV Telugu

David Warner: చెన్నైపై మిచౌంగ్ తుపాన్ విధ్వంసం.. డేవిడ్ వార్నర్ పోస్ట్

Warner

Warner

David Warner: మిచౌంగ్ తుపాన్ తో చెన్నై అతలాకుతలం అవుతుంది. భారీ వర్షాల ధాటికి నగరంలో వరదలు ముంచెత్తాయి. అంతేకాకుండా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో జనాలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో చెన్నై వాసులకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చేయూత అందిస్తున్నారు. తాజాగా.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా చెన్నై వాసులకు మద్దతుగా నిలబడ్డాడు.

Read Also: YCP vs TDP: హైదరాబాద్‌లో ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్..! టీడీపీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

విపత్కర పరిస్థితుల నుంచి నగరం తొందరగా బయటపడాలని వార్నర్ కోరాడు. ‘‘చెన్నైలోని చాలా వరకు ప్రాంతాలను వరదలు ముంచెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విపత్తు కారణంగా ఇబ్బందులు పడుతున్న వాళ్లను చూస్తుంటే బాధ కలుగుతోంది. అని డేవిడ్ వార్నర్ అన్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నవాళ్లు అవసరమైన వాళ్లకు తప్పక సాయపడండి. ఎక్కడున్నా ఒకరికొకరం మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది’’అని తన అభిమానులను ఉద్దేశించి వార్నర్‌ పోస్ట్‌ చేశాడు.

Read Also: Telangana CM: ఎల్బీ స్టేడియంలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం… ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

Exit mobile version