Site icon NTV Telugu

Cyclone Mandous: మాండస్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. తమిళనాడు, ఏపీలో అతిభారీ వర్షాలు!

Cyclone

Cyclone

Cyclone Mandous: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుఫాను రోజురోజుకూ మరింత బలంగా దూసుకొస్తోంది. దీనిపై వాతావరణ అధికారులు వేస్తున్న అంచనాలు మాటిమాటికీ మారిపోతున్నాయి. నిన్న తీరం దాటుతుందని అంచనా వేయగా.. తాజాగా ఈ లెక్క మారింది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడుకి దగ్గరలో ఉన్న ఈ తుఫాను.. శనివారం ఉదయం శ్రీహరికోట – పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం వల్ల ఉత్తర తమిళనాడుతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉంటుందని చెబుతున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 70 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలతో పాటు దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. తుఫాను ప్రభావంతో దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఐదు ఎన్డీఆర్‌ఎఫ్, నాలుగు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఏపీకి భారీ వర్ష సూచన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.

Children Missing : తిరుపతిలో నలుగురు చిన్నారుల మిస్సింగ్.. గాలిస్తున్న పోలీసులు

మరో వైపు తుఫాను నేపథ్యంలో తమిళనాడులో ఆరు జిల్లాల్లో ప్రభుత్వం రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. అలాగే ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను మోహరించారు. మాండస్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. చెన్నై నుండి సింగపూర్, ముంబై వెళ్ళాల్సిన 11 విమానాలను దారి మళ్లించినట్లు తెలుస్తోంది. తూత్తుకుడి, షిరిడీకి వెళ్ళే నాలుగు విమానాలను రద్దు చేశారు.

Exit mobile version