NTV Telugu Site icon

Indigo: ఫంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. తృటిలో తప్పిన విమాన ప్రమాదం.. గాల్లో వంపులు తిరిగిన ఫ్లైట్ (వీడియో)

Indigo

Indigo

ఫంగల్ తుఫాను ఇప్పటికీ సముద్ర తీర ప్రాంతాల్లో స్థిరంగా ఉంది. క్రమంగా బలహీనపడుతుందని భావిస్తున్నారు. అయితే తుఫాను తమిళనాడులోని విల్లుపురం, పుదుచ్చేరిలో భారీ వర్షాలకు కారణమైంది. దీని కారణంగా.. చైన్నై నగరంలో ఇండిగో విమానం తృటిలో క్రాష్ ల్యాండింగ్‌ను నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ల్యాండింగ్ సమయంలో విమానం నేలను ఢీకొట్టేందుకు యత్నించింది.

READ MORE: Eknath Shinde: మహారాష్ట్ర సీఎం అభ్యర్థిని రేపు నిర్ణయిస్తారు.. షిండే కీలక వ్యాఖ్యలు..

వాస్తవానికి ఈ విమానం ముంబై నుంచి చెన్నైకి వస్తోంది. బలమైన గాలులతో సహా ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంది. విమానాశ్రయం ర‌న్‌వేపై వర్షపు నీరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బ‌స్‌ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించింది. ల్యాండింగ్ అయ్యే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో అప్రమత్తమైన పైలెట్ తిరిగి విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లాడు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై విమానాశ్రయ సిబ్బంది స్పందిస్తూ.. “ఇది సురక్షితమైన ట్రైనింగ్. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో పైలట్‌కు ప్రొఫెషనల్ పద్ధతిలో శిక్షణ ఇచ్చాం. ఇలా సురక్షితమైన ల్యాండింగ్ సాధ్యం కానప్పుడు.. గో-అరౌండ్‌లు చేపట్టబడతాయి” అని ప్రకటనలో పేర్కొంది.