Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. అంధకారంలో మచిలీపట్నం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kasinkota Records 26.3 CM Rainfall: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కోస్తా జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మచిలీపట్నంలో రహదారులు నీటమునగ్గా.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. మరోవైపు కోనసీమలో తుఫాన్ ప్రభావంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా కశింకోటలో అత్యధికంగా 26.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విజయనగరం జిల్లా భోగాపురంలో 26.2 సెంటీమీటర్లు, వేపాడలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖపట్నంలో 26 సెంటీమీటర్లు, పెందుర్తిలో 24.2 సెంటీమీటర్లు, సింహాచలంలో 23.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లాలోని పరవాడలో 24.7 సెంటీమీటర్లు, యలమంచిలిలో 24 సెంటీమీటర్లు, అచ్యుతాపురంలో 23.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి.
Also Read
- థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
- Arnab Cyclone-School Holiday: తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
- Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
- Cyclone Arnab: మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు!
కృష్ణా జిల్లాలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నంలో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కుండపోత వర్షంతో రహదారులన్నీ నీటమునిగాయి. వర్షం తీవ్రత ఎక్కువగా ఉండటంతో నేలకొరిగిన చెట్లను తొలగించే పనులకు కూడా ఆటంకం ఏర్పడింది. మరోవైపు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు తెల్లవారుజాము నుంచే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో మచిలీపట్నంలోని పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. దుకాణాలు మూతపడ్డాయి. ఈదురుగాలుల ధాటికి హోర్డింగులు, బారికేడ్లు ఎగిరిపడుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
బాపట్ల జిల్లాలోనూ అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రేపల్లె ప్రాంతంలో రాత్రి నుంచే ఈదురుగాలులతో కూడిన వర్షం కొనసాగుతోంది. సముద్రంలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిజాంపట్నం హార్బర్లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అవసరమైన సాయం అందించేందుకు రేపల్లె నియోజకవర్గంలో ఐదు పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
అర్నబ్ తుఫాన్ కోనసీమ ప్రాంతంలోనూ తీవ్ర ప్రభావం చూపింది. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు భారీ సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, కమ్యూనికేషన్ వ్యవస్థకు కూడా అంతరాయం ఏర్పడింది. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణనష్టం తప్పిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించడం, విద్యుత్ సరఫరా, ఇతర సేవలను పునరుద్ధరించడం వంటి పనుల్లో యంత్రాంగం నిమగ్నమైంది. తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. బలమైన గాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని హెచ్చరించారు. నేలకొరిగిన విద్యుత్ తీగలను తాకవద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలని తెలిపారు.
తాజావార్తలు
-
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. అంధకారంలో మచిలీపట్నం!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
Arnab Cyclone-School Holiday: తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Captain Smit Machhar: భారత పైలట్‌కు UAE అత్యున్నత గౌరవం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ ప్రదానం
-
Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
ట్రెండింగ్
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు