Site icon NTV Telugu

Trollers : ట్రోలర్స్‌పై కేసులు నమోదు..

Trollers

Trollers

ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో అసత్య ట్రోల్స్ చేస్తున్న వారిని కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డీసీపీ హైదరాబాద్ స్నేహా మెహ్రా మాట్లాడుతూ.. 20 మందిపై కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. సోషల్ మీడియా లో ప్రజా ప్రతినిధుల పై అసత్య ప్రచారం చేస్తూ ట్రోల్ చేస్తున్న వారిపై కేసులు చేసామని వెల్లడించారు. మహిళలను కించపరిచే విధంగా ట్రోలింగ్ చేస్తున్న పలు సోషల్ మీడియా నిర్వాహకులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత పై ఈ మధ్య ఎక్కువ ట్రోలింగ్ జరిగాయని గుర్తించామన్నారు. ఎమ్మెల్సీ కవితపై కించపరిచే విధంగా, అభ్యుస్, వల్గర్ గా ట్రోల్ చేశారన్నారు.

Also Read : Khaleel Ahmed : చెప్పింది చేయకపోతే మా నాన్న బెల్టుతో చితక్కొట్టేవాడు..

దీంతో పాటు మహిళలపై అత్యధికంగా.. ట్రోల్స్ జరుగుతున్నాయని గుర్తించామని, ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంత మంది ప్రజా ప్రతినిధుల పై ట్రోల్స్ జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. టీఆర్పీ, సబ్‌స్క్రైబర్స్, వ్యూస్ కోసం.. ఇలా చేస్తున్నారని, ఎక్కువ మంది యువత ఈ ట్రోలింగ్ కి పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే 20 మంది పై కేసులు నమోదు చేసి.. 8 మందికి నోటీసులు ఇచ్చామని ఆమె వివరించారు. ప్రధానంగా మహిళల ను కించపరిచే విధంగా ట్రోల్స్, మీమ్స్ చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

Also Read : Karnataka: కాంగ్రెస్‌కు డీకే శివకుమార్ తలనొప్పి.. నోట్లు వెదజల్లడంపై విమర్శలు..

Exit mobile version