Site icon NTV Telugu

Cyber Fraud: ప్రాణం తీశారు కదరా.. రిటైర్డ్ అధికారి నుంచి రూ.1.19 కోట్లు కాజేసిన సైబర్ మోసగాళ్లు.. షాక్ లో మృతి

Cyber Crime

Cyber Crime

సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్టుల పేరుతో రెచ్చిపోతున్నారు. తాజాగా పూణేలో ఓ రిటైర్డ్ అధికారిని డిజిటల్ అరెస్టు పేరుతో మోసం చేసి ఏఖంగా రూ. 1.19 కోట్లు కాజేశారు. తన జీవిత కాలంలో దాచుకున్న సొమ్ము మొత్తాన్ని కొల్లగొట్టారు. సైబర్ క్రిమినల్స్ వేధింపులు, ఆర్థిక నష్టం ఒత్తిడి కారణంగా బాధితుడు అక్టోబర్ 22న ఇంట్లో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు. మృతుడి భార్య సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read:Komatireddy Venkat Reddy: మొంథా తుఫాను ఎఫెక్ట్.. తెలంగాణలో దెబ్బతిన్న 230 కి.మీ రోడ్లు..!

FIR ప్రకారం, ఆగస్టు 16న రిటైర్డ్ అధికారికి ఫోన్ కాల్ రావడంతో ఈ ఘోరానికి తెరలేచింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ముంబై పోలీసులలో “ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్”గా పరిచయం చేసుకున్నాడు. రిటైర్డ్ అధికారి బ్యాంకు ఖాతాలు, ఆధార్ నంబర్‌ను ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్ కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఉపయోగిస్తున్నారని ఆరోపించాడు. ఆ మోసగాడు తరువాత తనను తాను CBI ఢిల్లీ కార్యాలయం నుండి వచ్చిన IPS అధికారిగా పరిచయం చేసుకుని, సహకరించకపోతే ఆ జంటను “హోమ్ అరెస్ట్” లేదా “జైలు అరెస్ట్” చేస్తానని బెదిరించాడు.

Also Read:Rishabh Pant Jersey: కోహ్లీ జెర్సీ ధరించిన రిషభ్ పంత్‌.. నెట్టింట పలు ఊహాగానాలు!

నిందితుడు వృద్ధుడి ఫోన్ కెమెరాను ఆన్ చేసి, ఆ జంటను మూడు రోజుల పాటు “డిజిటల్ అరెస్ట్”లో ఉంచాడని పూణే సైబర్ పోలీస్ డిసిపి వివేక్ మసల్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఆ దంపతుల నుంచి సున్నితమైన ఆర్థిక, వ్యక్తిగత సమాచారాన్ని పొందారు. దర్యాప్తు ముసుగులో దంపతులను పదే పదే ప్రశ్నించారు. వేధింపులు, ఆర్థిక నష్టం కారణంగా భర్త తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని, అది అతని మరణానికి కారణమై ఉండవచ్చని డిసిపి మసల్ నిర్ధారించారు.

Exit mobile version