Kamareddy Software Girl Lose Rs 50 Thuosand in E-Scam: ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. సైబర్ కేటుగాళ్లు రోజుకో రకం కొత్త మోసాలతో అమాయకులను సునాయాసంగా బురిడీ కొట్టిస్తున్నారు. జాబ్ ఆఫర్‌లు, ఈ కేవైసీ, ఖరీదైన గిప్ట్‌లు, డ్రగ్స్ పార్సిల్, లాటరీలతో మోసాలకు పాల్పడుతూ.. కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారు. అమాయక ప్రజలే కాదు ఉన్నత ఉద్యోగంలో ఉన్న వారిని కూడా యిట్టె బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా సైబర్ కేటుగాళ్లు ఓ సాఫ్ట్‌వేర్ యువతికి టోకరా పెట్టారు. లక్కీ డ్రాలో మొబైల్ ఫోన్ గెలుచుకున్నావంటూ రూ. 50,000 స్వాహా చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి సైబర్ కేటుగాళ్ల నుంచి ఓ కాల్ వచ్చింది. మీరు లక్కీ డ్రాలో విలువైన మొబైల్ ఫోన్ గెలుచుకున్నారని ఫోన్ చేసి.. జీఎస్టీ కింద రూ. 50,000 చెల్లించాలని చెప్పారు. సైబర్ కేటుగాళ్ల మాయ మాటలు నమ్మిన సాఫ్ట్‌వేర్ యువతి.. వారు ఇచ్చిన నంబర్‌కి రూ. 50,000 వేలు జమ చేసింది.
Also Read: Agra Container: డ్రైవర్ లేకుండా రోడ్డుపై దూసుకెళ్లిన కంటెయినర్.. పరుగులు తీసిన జనాలు!
డబ్బు చెల్లించిన అనంతరం సైబర్ కేటుగాళ్లకు సాఫ్ట్‌వేర్ యువతి తిరిగి ఫోన్ చేయగా.. ఫోన్ స్విచాఫ్ వచ్చింది. చాలాసార్లు ప్రయత్నించినా ఫోన్ స్విచాఫ్‌లోనే ఉంది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆయువతి.. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న కామారెడ్డి పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.