Site icon NTV Telugu

Cyber Den: కాల్ సెంటర్ ముగుసుగులో భారీగా ఆర్థికమోసాలు.. అమెజాన్ కస్టమర్లే లక్ష్యంగా..?!

Cyber Den

Cyber Den

Cyber Den: విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో సైబర్ నేరాల కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారీ ముఠా పై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. భోగాపురంలోని కొన్ని అపార్టుమెంట్లు అద్దెకు తీసుకుని ఈ ముఠా గత రెండేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వెల్లడైంది. కాల్ సెంటర్ ముసుగులో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా ప్రధానంగా అమెరికాలోని అమెజాన్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కోట్లాది రూపాయల మోసాలకు తెగబడింది. ఈ ముఠా తూర్పు, ఈశాన్య భారత రాష్ట్రాల నుండి యువతీ యువకులను తీసుకువచ్చి వారిని ఈ కార్యకలాపాల్లో భాగస్వాములను చేసింది. వారిని ప్రత్యేకంగా శిక్షణనిచ్చి ఫోన్ ద్వారా విదేశీ కస్టమర్లతో సంభాషణ చేయిస్తూ అకర్మలకు పాల్పడింది. అనకాపల్లి జిల్లా పోలీసులు ఈ నెలలో జరిగిన దాడిలో 100 మందికిపైగా యువతను గుర్తించి, వారిలో 30 మందిని అరెస్ట్ చేశారు.

Read Also: Bride Calls Off Wedding: తాళి కట్టే సమయంలో ఝలక్ ఇచ్చిన పెళ్లికూతురు.. చివరకు లవర్‌తో..!

ఈ సైబర్ డెన్‌పై దృష్టి సారించేందుకు ఒక సాధారణ వ్యక్తి చేసిన ఫోన్ కాల్ తోనే కీలక సమాచారం బయటపడింది. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మెరుపు దాడులు జరిగాయి. సోదాల్లో భారీగా కంప్యూటర్లు, కమ్యూనికేషన్ పరికరాలు, డేటా స్టోరేజ్ డివైస్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో వెలుగు చూసిన మోసాల విలువ సుమారుగా రూ.600 కోట్లకు పైగా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇదంతా విస్తృతంగా జరుగుతున్న ఆర్థిక నేరంగా పరిగణిస్తూ కేసును CIDకి అప్పగించింది ఏపీ ప్రభుత్వం. దీనితో DSP స్థాయి అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది. CID అధికారులు ఈ ముఠా కార్యకలాపాలను వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.

Read Also: S**X On Road: బరితెగించిన రాజకీయ నేత.. రోడ్డుమీదే కారు ఆపి పబ్లిక్ గా శృంగారలీలలు..!

రెండేళ్లుగా ఈ ముఠా సైబర్ డెన్ నడుపుతున్నా ఇప్పటిదాకా ఎలా గుర్తించలేకపోయారన్నది కీలక ప్రశ్నగా మారింది. భోగాపురంలో ఓ సాధారణ అపార్టుమెంట్లో ఇంటర్నేషనల్ స్థాయిలో మోసాలు సాగుతుండటమే గాక, ప్రతి నెలా 15 నుంచి 20 కోట్ల వరకు మోసగిస్తున్నారు. దీనికి కీలక సూత్రధారులు ఎవరు? ఎవరెవరు దీన్ని నడిపిస్తున్నారు? అనే కోణాల్లో విచారణ జరుగుతోంది. ఈ ఉదంతం మరోసారి సైబర్ సెక్యూరిటీపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చాటుతోంది.

Exit mobile version