Site icon NTV Telugu

Cyber Fraud: సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు కీలక అప్డేట్..

Cyber Crime

Cyber Crime

Cyber Fraud: సాంకేతిక ప్రగతికి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దాడి చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, అధిక లాభాల పేరుతో ఫేక్ లింకులు పంపుతూ ఫోన్ క్లిక్‌తోనే ఖాతాల్ని ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్ల పేరుతో వచ్చే లింకులను బదులిచ్చే ముందు ఒక్కసారైనా ఆలోచించాలని పోలీసులు సూచిస్తున్నారు. “మీ ఆసక్తి, అవసరాలే మోసగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. ఇలాంటి లింకులపై క్లిక్ చేయకండి. మోసాల బారి నుంచి మీరే మీను కాపాడుకోవాలి,” అని పలు సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేశారు.

Pahalgam terror attack: ప్రధాని మోడీతో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ..

అంతేకాక, ఇంట్లో నుంచే పనిచేసి డబ్బులు సంపాదించొచ్చన్న పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో కూడా భారీగా మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో విస్తరిస్తున్న ప్రకటనలపై నమ్మకము పెట్టవద్దని, చిన్న పెట్టుబడితో భారీ లాభాలు అనే వాగ్దానాలు ఎప్పుడూ మోసమేనని వారు తెలిపారు. ఇటీవలి ఉదాహరణగా హన్మకొండ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనను చూడొచ్చు. ఉప్పులపల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి ఒక క్రిప్టోకరెన్సీ పెట్టుబడి లింకులో మోసపోయాడు. మొదట రూ.1,000 పంపించి నమ్మకం కలిగించి, మొత్తం రూ. 7,83,500 వరకు ఖాతాల్లో చెల్లింపులు చేయించి చివరికి ఎటూ తిరిగి రాకుండా మోసం చేశారు. పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ తరహా మోసాల నుంచి రక్షణ పొందాలంటే జాగ్రత్తే ఒకే మార్గమని తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Myopia: 2050 వరకు భారత్‌లో సంగం మంది స్కూలుకెళ్లే పిల్లలకు కళ్ల జోడు?

Exit mobile version