Site icon NTV Telugu

Cyber Crime: సైబర్ నేరగాళ్లు నయా మోసం.. ఈ-చలాన్ పేరుతో మెసేజ్ లు

Cyber Crime

Cyber Crime

సైబర్‌ నేరగాళ్లు జనాలను దోచుకునేందుకు ఎప్పటికప్పుడు తమ రూట్ మార్చుకుంటున్నారు. అయితే, ఈ మధ్య ట్రాఫిక్‌ చలాన్‌లకు సంబంధించిన ఈ-చలాన్‌ల పేరిట కొత్త రకం మోసానికి తెరదీశారు. ఈ-చలాన్‌ల పేరుతో వాహనదారులకు వ్యక్తిగత ఎస్ఎమ్ఎస్ లు పంపి వారిని బురిడీ కొట్టిస్తున్నారు. దాంతో ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Read Also: Fuel Prices: ఎన్నికల సమయం.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?

ఇక, ఇటీవలి కాలంలో సైబర్ చీటర్స్ ఈ-చలాన్‌ల పేరుతో వ్యక్తిగత మెస్సేజ్ లు పంపుతున్నారని, అందులోనే పేమెంట్ లింకును కూడా ఉంచుతున్నారు.. ఎవరైనా నిజమే అనుకుని ఆ లింకుపై క్లిక్‌ చేస్తే బ్యాంకు ఖాతా వివరాలను హ్యాక్‌ చేసి అందులో ఉన్న మొత్తం డబ్బులు మాయం చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి మెస్సేజ్ ల పట్ల వాహనాదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
సాధారణంగా ఈ-చలాన్‌ల పేరిట వచ్చే మెసేజ్‌లలో వాహనం నంబర్‌, ఇంజిన్‌, ఛాసిస్‌ నంబర్‌ లాంటి వివరాలు ఉంటాయి.. సైబర్‌ నేరగాళ్లు పంపే వాటిలో ఆ వివరాలు ఏమీ ఉండవని పోలీసులు చెప్పుకొచ్చారు.

Read Also: Sapthami Gowda: కాంతార బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ‘తమ్ముడు’ తోనే..?

అదేవిధంగా ఇలాంటి మెసేజ్‌లు తమ మొబైల్‌ ఫోన్‌ల నుంచి రావనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తుంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇలాంటి అనుమానాస్పద సందేశాలు వచ్చినప్పుడు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్‌ చేసుకోవాలని పోలీసులు వెల్లడించారు. ఈ-చలాన్‌లకు సంబంధించిన వెబ్‌సైట్‌ను పోలిన వెబ్‌సైట్‌లతో నేరగాళ్లు మోసాలకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఒకవేళ మోసపోతే వెంటనే సైబర్‌ క్రైమ్‌ విభాగానికి, బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి.. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Exit mobile version