NTV Telugu Site icon

Cyber Fraud: ఎంతకు తెగించార్రా.. బిల్ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామంటూ మెస్సేజ్ లు..

Cyber

Cyber

సైబర్ నేరగాళ్లకు టెక్నాలజీ వరంగా మారింది. రోజుకో ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. కాల్స్, మెసేజ్ లు, ఫేక్ లింక్స్ పంపిస్తూ వాటిని క్లిక్ చేయగానే ఖాతాలు లూటీ చేస్తున్నారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా విద్యుత్ వినియోగదారులను ను టార్గెట్ చేశారు సైబర్ చీటర్స్. కరెంట్ బిల్ పెండింగ్ లో ఉందని.. బిల్ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని మెసేజ్ లు పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

Also Read:POCO F7: ప్రీమియమ్ ఫీచర్స్తో గ్లోబల్గా రిలీజైన POCO F7 అల్ట్రా, F7 ప్రో మొబైల్స్

సైబర్ క్రిమినల్స్ విద్యుత్ వినియోగదారులకు, కరెంట్ బిల్ కట్టని వారికి 896795 4941నెంబర్ తో వాట్సప్ మెస్సేజ్ లు పంపిస్తున్నారు. మీ కరెంట్ బిల్లు పెండింగ్ లో ఉంది. ఈరోజు సాయంత్రం లోగా చెల్లించకపోతే మీ ఇంటికి కరెంట్ సరఫరా నిలిపివేస్తామంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు. ఈరోజు రాత్రికి 7:30కి పవర్ కట్ చేయబడునని సైబర్ మోసగాళ్లు భయపెడుతున్నారు. పవర్ కట్ చేయొద్దంటే వెంటనే 8135967194, 8135967194 నెంబర్స్ కు కాల్ చేయాలని మోసగాళ్లు మెస్సేజ్ లు పంపిస్తున్నారు.

Also Read:Kannappa: అంత నమ్మకం ఉంటే ఈ శాపాలెందుకు?

బిల్ పేమెంట్ కోసం లింక్స్ పంపుతున్న కేటుగాళ్లు. వీడియో కాల్స్ సైతం చేస్తున్న ఫ్రాడ్ స్టర్స్. వీరి వలలో పడ్డ వారు ఆ లింక్స్ పై క్లిక్ చేయగానే అకౌంట్ లో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. ఈ వ్యవహారంతో అప్రమత్తమైన అధికారులు వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒక నెంబర్ తో ఎప్పుడు విద్యుత్ శాఖ మెస్సేజ్ పంపదని.. ఎలాంటి లింక్స్ సైతం విద్యుత్ డిపార్ట్ మెంట్ పంపదని.. బ్యాంకు ఖాతా, క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలు ఎవ్వరికీ ఇవ్వొద్దని TGSDCLమేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి సూచించారు.

Also Read:MH370: పదేళ్ల కిందట విమానం మిస్సింగ్.. ఆచూకీ కోసం ఇప్పుడు సెర్చింగ్..!!

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

లింకులు క్లిక్ చేయొద్దు: కరెంట్ బిల్లు చెల్లించాలంటూ వచ్చిన సందేశాల్లోని లింక్‌ను క్లిక్ చేయకుండా, అధికారిక వెబ్‌సైట్ ద్వారా బిల్లు చెల్లించాలి.

అధికారిక సమాచారం పొందండి: మీ కరెంట్ బిల్లు స్టేటస్ తెలుసుకోవడానికి ఎప్పుడూ డిస్కమ్ అధికారిక వెబ్‌సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించండి.

గూగుల్ సెర్చ్ చేయండి: మీకు సందేహం వస్తే, లింక్‌ను క్లిక్ చేయకుండా, మీ రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను గూగుల్‌లో వెతకండి.

అనుమానాస్పద సందేశాలను అంగీకరించొద్దు: మీ ఫోన్‌కు వచ్చిన అనుమానాస్పద మెసేజ్‌లను నమ్మకండి. అటువంటి సందేశాలను తక్షణమే డిలీట్ చేయండి.

పోలీసులకు సమాచారం ఇవ్వండి: ఇలాంటి మోసపూరిత మెసేజ్‌లు వస్తే, పోలీసులకు ఫిర్యాదు చేయండి.