Netherlands Player Teja Nidamanuru Talks in telugu: వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. 290-300 ప్లస్ స్కోర్ చేయాలని తాము భావిస్తున్నట్లు పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు.
హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన గత రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ భారీగా పరుగులు చేసింది. ఆ అనుభవాన్ని మెగా టోర్నీలో వినియోగించుకోవాలని పాక్ చూస్తోంది. తొలి మ్యాచ్‌లోనే పెద్ద జట్టుకు షాక్ ఇవ్వాలని నెదర్లాండ్స్ భావిస్తోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో ఉచితంగా చూడవచ్చు.
నెదర్లాండ్స్ జట్టులో తెలుగు మూలాలున్న విజయవాడ వాసి తేజా నిడమనూర్‌కు వరల్డ్ కప్ 2023లో చోటు దక్కిన విషయం తెలిసిందే. అంతేకాదు పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ సందర్భంగా తేజ మాట్లాడుతూ.. నెదర్లాండ్స్‌కు మద్దతు ఇవ్వాలని సోషల్ మీడియాలో కోరాడు. ‘హైదరాబాద్.. మీకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. ఇవాళ పాక్‌తో ఉప్పల్‌లో మేం మ్యాచ్ ఆడుతున్నాం. మీరు మైదానానికి వచ్చి మాకు మద్దతు ఇస్తే చాలా సంతోష పడతాం’ అని తేజ అభిమానులను కోరాడు.
తుది జట్లు:
పాకిస్థాన్: ఇమామ్-ఉల్-హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.
నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్.
A special message in Telugu for Hyderabad from Teja Nidamanuru before our #CWC23 🧡 pic.twitter.com/Tbm9hvbfs1
— Cricket🏏Netherlands (@KNCBcricket) October 5, 2023