NTV Telugu Site icon

HYDRA Effect : అక్కడ ఫ్లాట్స్‌ బుకింగ్స్‌ కాన్సిల్‌ చేసుకుంటున్న కస్టమర్లు..?

Ameenpur Lake

Ameenpur Lake

ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వ్యవహారం హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది. ఇటీవల ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దీనిపైనే ఉంది. అంతేకాకుండా.. రోజు రోజుకు హైడ్రా స్పీడ్‌ పెంచి అక్రమ కట్టడాలను కూల్చేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే.. హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఉన్న చెరువులను అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేస్తున్న హైడ్రా తీరుతో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఫ్లాట్స్‌ బుకింగ్స్‌ చేసుకున్నవారు అప్రమత్తమయ్యారు. అయితే.. ఈ నేపథ్యంలోనే అమీన్‌పూర్‌ చెరువు బఫర్‌ జోన్‌లో నిర్మించిన భవనాలను సైతం హైడ్రా కూల్చేవేసే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ భవనాల్లో ఇప్పటికే ఫ్లాట్స్‌ బుకింగ్స్‌ చేసుకున్న కస్టమర్లు తమ తమ బుకింగ్స్‌ కాన్సిల్‌ చేసుకొని వారి డబ్బులు తిరిగి తీసుకునేందుకు యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నారు తెలుస్తోంది. ఇదే కాకుండా.. ప్రస్తుతం ఫ్లాట్స్‌ బుకింగ్స్‌ చేసుకున్న వారు సైతం తమ భవనాల్లు బఫర్‌ జోన్‌లో ఉన్నాయో లేదోనని ఆరా తీయడం ప్రారంభించారు. ఒకవేళ బఫర్‌ జోన్‌లో ఉంటే తమ బుకింగ్స్‌ కాన్సిల్‌ చేసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.

 
Mohanlal: లైంగిక వేధింపులపై హేమా కమిటీ రిపోర్టుని స్వాగతించిన మోహన్ లాల్..
 

ఇదిలా ఉంటే.. గగన్‌పహాడ్‌లోని అప్పా చెరువు, మామిడి చెరువు పూర్తి ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) పరిధిలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా శనివారం కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత కార్యకలాపాలు ప్రారంభించి, ఈ నీటి వనరులలో ఎఫ్‌టిఎల్ పరిధిలోకి వచ్చే భూముల్లో పారిశ్రామిక షెడ్‌లు సహా అక్రమ ఆక్రమణలుగా గుర్తించిన నిర్మాణాలపై దృష్టి సారిస్తున్నారు. ఒకప్పుడు 34 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు ఏళ్ల తరబడి ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 10-12 ఎకరాలకు తగ్గిపోయిందని హైడ్రా కమిషనర్ ఎవీ రంగనాథ్ గుర్తించారు. ఈ ప్రాంతం గతంలో 2020 అక్టోబర్‌లో, ముఖ్యంగా 13వ తేదీన హైదరాబాద్‌లో వరదల సమయంలో గణనీయమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూసింది. హైడ్రా కొత్త బృందాలు, మెరుగైన అధికారాలతో బలపడింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నాయకత్వంలో, హైదరాబాద్ 72 కొత్త బృందాలను ఏర్పాటు చేయడం, సిబ్బందిని పెంచడం ద్వారా దాని విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ సంస్థ (HYDRA)ని గణనీయంగా బలోపేతం చేసింది. ఏజెన్సీ తన కార్యకలాపాలలో మరింత చురుగ్గా, పటిష్టంగా మారింది.

 Bandla Ganesh: బండ్ల గణేష్ బుల్లెట్ ఆన్సర్స్.. బన్నీని అంతమాట అనేశాడేంటి..?