సీతాఫలం పండ్ల గురించి అందరికి తెలుసు.. పండ్ల తోటలను పండించే రైతులు వీటిని కూడా ఎక్కువగా పండిస్తున్నారు.. వీటిలో మంచి పోషకాలు ఉండటంతో జనాలు వీటిని తింటున్నారు.. ఈ మధ్య సీతాఫలం దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది దాంతో మళ్లీ రైతులు కొత్త రకం సీతాఫలం పండ్లను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ పండ్లు కేవలం చలికాలంలో మాత్రమే వస్తాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వచ్చాక ఈ చెట్లు పెద్దగా కనిపించడం లేదు. ఈ పంట ద్వారా కూడా ప్రస్తుతం రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి. సీతాఫలం పండ్ల చెట్లల్లో రెండు కొత్త రకాలు ఉన్నాయి. ఈ రకాలని గ్రాఫ్టింగ్ ద్వారా తయారు చేశారు..
ఇందులో బాలానగర్, సూపర్ గోల్డ్ అని పిలుస్తున్నారు. బాలానగర్ వెరైటీ మొక్కలో చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ఈ మొక్క గ్రాఫ్టింగ్ పద్దతిలో సాగు చేశారు. ఈ రకం మొక్కని నాటిన రెండు సంవత్సరాల తర్వాత పంట దిగుబడి వస్తుంది. ఈ మొక్క జూన్ లేదా జులై నెలలో పూతకు వస్తుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో కోతలు కోసుకోవచ్చు.. సూపర్ గోల్డ్ రకంను కూడా ఇలానే పెంచుతున్నారు.. రెండు సంవత్సరాల తర్వాత కాయలు రావడం మొదలవుతాయి..సూపర్ గోల్డ్ రకంలో నవంబర్ నెలలో కోతలు మొదలు అవుతాయి. జనవరి నెల ఆకరిలో కోతలు పూర్తి అవుతాయి. ఈ రెండు రకాలకు కేవలం పూత వచ్చే సమయంలో మాత్రమే నీటిని ఇవ్వాలి. ఆ తర్వాత ఈ పంటకి ఎలాంటి నిర్వహణ పనులు ఉండవు.. ఒకవేళ నల్లి ఉంటే సున్నం కలిపి మొక్కలకు పిచికారి చెయ్యడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది..
ఈ పండ్లను వ్యాపారులు పొలం దగ్గరకే వచ్చి కొంటె వీటి ధర కేవలం కిలో 50 రూపాయలు పలుకుతుంది.. అదే మార్కెట్ లో అమ్ముకుంటే మంచి ధర పలుకుతుంది.. మార్కెట్లో కిలో 100-150 రూపాయలకి అమ్ముతున్నారు. ఈ చెట్లకి కేవలం నాలుగు నెలలు నీళ్లు, ఎరువులు ఇస్తే చాలు, ఆ తర్వాత ఈ చెట్లకి నీళ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక ఎకరంలో ఈ పండ్లను సాగు చేస్తే ఒక సీజన్ కు రెండు నుంచి మూడు లక్షల లాభాలను పొందవచ్చు..