నేడు రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. సభ వాయిదా పడిన తర్వాత నిన్న సాధారణ తనిఖీల్లో భద్రతా అధికారులు ప్రస్తుతం అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు నంబర్ 222 నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారని రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ తెలిపారు. రూ.500 కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించినట్లు ధన్‌ఖర్ తెలిపారు. ఆ నోట్ల అసలైనవో.. నకిలీవో స్పష్టత లేదన్నారు. చట్ట ప్రకారం విచారణ జరుగుతుందన్నారు. డబ్బు ఎవరిది అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
READ MORE: Shaktiman : అటు ఇటు తిరిగి ఆఖరికి ‘శక్తిమాన్’ ఎవరు అవుతారో ?
రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ నోట్లను స్వీకరించడంపై మాట్లాడిన వెంటనే, ప్రతిపక్ష ఎంపీలు రచ్చ సృష్టించడం ప్రారంభించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. “ఈ వ్యవహారంపై విచారణ కొనసాగి.. అంతా తేలిపోయే వరకు ఛైర్మన్ అభిషేక్ మను సింఘ్వీ పేరు ప్రస్తావించకుండా ఉండాల్సిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖర్గే ప్రకటనపై అధికార పార్టీ ఎంపీలు రచ్చ సృష్టించారు. ఆదే సీటు వద్ద దొరికాయని మీరు ఎలా చెప్పగలరు? అని ప్రశ్నించారు.
READ MORE:Komatireddy Venkat Reddy: నాకు పేరు వస్తుందనే కేసీఆర్ నిధులు విడుదల చేయలేదు..
తాజాగా ఈ అంశంపై అభిషేక్ సింఘ్వీ స్పందించారు. “ఇలాంటిది ఇప్పటివరకు నేను ఎప్పుడూ చూడలేదు.. నిన్న రాజ్యసభకు వచ్చినప్పుడు నా జేబులో కేవలం ఒక రూ.500 నోటు మాత్రమే ఉంది. నేను రాజ్యసభకు 12.57కు చేరుకున్నాను. మధ్యాహ్నం 1 గంటకి సభ వాయిదా పడింది.. నేను అప్పటి నుంచి 1.30 వరకు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో క్యాంటిన్‌లో కూర్చున్నాను.. ఆ తర్వాత వెళ్లిపోయాను.” అని తెలిపారు.