NTV Telugu Site icon

Manipur violence: మళ్లీ మణిపూర్లో హింసాత్మక ఘటనలు.. ఒకరు మృతి

Manipur

Manipur

Manipur violence: లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మణిపూర్‌ రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు నెలకొన్నాయి. జిరిబామ్ జిల్లాలో మైతీ వర్గానికి చెందిన సోయిబమ్ శరత్‌కుమార్ అనే వ్యక్తిని కుకీ మిలిటెంట్లు దారుణంగా హత్య చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శరత్‌ అనే వ్యక్తి తన పొలం నుంచి తిరిగి వస్తుండగా మాయమైపోయాడని, శరీరంపై పదునైన వస్తువుతో పొడిచినట్టు గాయాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే, స్థానికంగా ఉండే ఇళ్లకు నిప్పు పెట్టారు.. దీంతో జిరిబామ్ జిల్లా మేజిస్ట్రేట్ అల్లర్లను నిరోధించడానికి జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించేశారు.

Read Also: Encounter : జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో కాల్పులు.. ఒకరి మృతి.. భారీగా బలగాల మోహరింపు

కాగా, ఘటనా ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించాలని ఎస్పీని జిరిబామ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ హింసాత్మక పరిస్థితుల తర్వాత భయాందోళనకు గురైన మైతీ ప్రజలు తమ ఇళ్లను విడిచి పెట్టి పాఠశాలల్లో తల దాచుకున్నారు. ఇక, అస్సాం రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, మణిపూర్ పోలీస్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ అధికారులతో కూడిన జాయింట్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. మరోవైపు మణిపూర్ హింసాకాండకు కీలకమైన నిందితుడు థోంగ్‌మింథాంగ్ హౌకిప్ అలియాస్ రోజర్‌ని ఈ నెల 6న ఇంఫాల్ లోని ఎయిర్ పోర్టులో ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. అతనిపై గతేడాది జూలై 18వ తేదీన ఎన్‌ఐఏ కేసు ఫైల్ చేసింది.

Read Also: SL vs BAN: శ్రీలంకపై 2 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం..

ఇక, గతేడాది మే నుంచి మణిపూర్‌లో కుకీ, మైటీ వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ జాతుల మధ్య దాడులతో ఇప్పటి వరకు సుమారు 200 మందికి పైగా చనిపోగా.. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ హింసాత్మక ఘటనలు కొనసాగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.