NTV Telugu Site icon

Crocodile Mummy: 3000 ఏళ్లనాటి మొసలి మమ్మీ.. సీటీ స్కాన్ లో సంచలన విషయాలు!

Crocodile Mummy

Crocodile Mummy

ఈజిప్ట్ పిరమిడ్లు.. మమ్మీలకు ప్రసిద్ధి చెందింది. అయితే వాటి వెనుక చాలా కథలు ఉన్నాయి. మతపరమైన ఆచారాల ప్రకారం కొన్ని జంతువులను కూడా బలి ఇచ్చారని ఓ అధ్యయనం గుర్తించింది. ఇటీవల ఓ మమ్మీ మొసలిని గుర్తించిన శాస్త్రవేత్తలు దానికి బర్మింగ్‌హామ్ మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచారు. ఆర్కియాలజీ అండ్ కల్చరల్ హెరిటేజ్ డిజిటల్ అప్లికేషన్స్ అనే జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో భాగంగా మొసలిని స్కాన్ చేశారు శాస్త్రవేత్తలు. పొట్టలో జీర్ణం కాని చేప, చేప హుక్ ను కనుగొన్నారు. దీన్ని వేటాడి పట్టుకొచ్చిన వెంటనే బలి ఇచ్చినట్లు నిర్ధారించారు.

READ MORE: CM Chandrababu: రేపు సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్న సీఎం చంద్రబాబు

ఈజిప్టులోని పురాతన మనుషులనే కాకుండా.. వేలాది జంతువులను కూడా మమ్మిలాగా మార్చేవారు. ఈ తరుణంలో ఇటీవల కనుగొన్న మూడు వేల ఏళ్ల నాటి మొసలి మమ్మీపై మరోసారి పరిశోధనలు చేశారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు మొసలి ఎలా చనిపోయిందో కనుగొనేందుకు యత్నించారు. మమ్మీ చేయబడే ముందు మొసలికి ఏమి తినిపించారు? అంటే దాని కడుపులో ఇంకా ఆహారం మిగిలి ఉందా? ఎలా చంపారు? అనే పలు ప్రశ్నలు శాస్త్రవేత్తలను తలెత్తాయి. దీంతో మొసలిని రాయల్ మాంచెస్టర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. పలు పరికరాలు వాడి దాదాపు 3000 సంవత్సరాలున్న ముసలి మమ్మీని బయటకు తీశారు. సీటీ స్కాన్ నిర్వహించారు. దీంతో సంచలన విషయాలు వెలువడ్డాయి. ఈ మొసలి కడుపులో గ్యాస్ట్రోలిత్‌లు కనిపించాయి. గ్యాస్ట్రోలిత్‌లు అంటే అలిమెంటరీ కెనాల్‌లో కనిపించే చిన్న రాళ్లు.

READ MORE:Arshad Warsi: కల్కిలో ప్రభాస్‌ ఒక జోకర్‌లా ఉన్నాడు.. ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్

చాలా సార్లు మొసళ్ళు చిన్న రాళ్లను మింగేస్తాయి. దీంతో మొసలిని మమ్మీ చేసిన వ్యక్తులు దాని అంతర్గత అవయవాలను బయటకు తీయలేదని నిర్ధారించింది. పొట్ట లోపల మెటల్ ఫిషింగ్ హుక్, చేపలు కళేబరాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో ఒక చేపను హుక్ చేసి నదిలో పడేసి మొసలిని పట్టుకునేవారు. మొసలి ఈ చేపను తినేందుకు వచ్చినప్పుడు వలలో చిక్కుకుపోయేది. ఈ కథ గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ యొక్క పత్రాలలో కనుగొనబడింది. క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో హెరోడోటస్ ఈజిప్ట్‌కు వెళ్లి ఇలాంటి చాలా కథలు రాసినట్లు సమాచారం.

READ MORE:Kolkata Doctor Case: “ఎందుకీ ద్వంద్వ వైఖరి”.. సీఎం మమతా బెనర్జీపై ట్రైనీ డాక్టర్ తండ్రి ఆగ్రహం..

ప్రస్తుతం, ఈజిప్టులో కనిపించని కొన్ని జంతువుల మమ్మీలు కూడా ఉన్నాయి. ఐబీస్ అనే ఓ అది పొడవాటి కాళ్లు, వంగిన ముక్కుతో వేటాడే పక్షి కూడా ఉంది. ఇది టోత్ అనే దేవునికి సమర్పించబడిందని కథలు చెబుతున్నాయి. దీంతో పాటు ఇక్కడ చాలా మొసళ్ల మమ్మీలు కనుగొనబడ్డాయి. ఇందులో ఇప్పుడు పరీక్షించిన మొసలి పెద్దది. ఇదే అతి పెద్దది. ఈజిప్టులోని ప్రజలు కూడా మొసలి చర్మాన్ని ధరించేవారని సమాచారం.