NTV Telugu Site icon

Chandrababu : పింఛన్ల పంపిణీపై సీఎస్ తీరు సరికాదు

Cbn

Cbn

గిద్దలూరు చెత్త మార్కాపురంలో బంగారం అవుతుందా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా పొదిలి బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. శేషాచలం స్మగ్లర్ చెవిరెడ్డి కావాలా… ప్రజానాయకుడు మాగుంట కావాలో తెలుసుకోవాలని ఓటర్లకు సూచించారు. పింఛన్లు మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. పింఛను 200 నుంచి 2000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో సీఎస్ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు. సింపతి కోసం జగన్ ప్రాథేయ పడుతున్నారన్నారు.

READ MORE: AP Weather: రికార్డు స్థాయిలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత.. రేపు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

తండ్రి, బాబాయి చావును అడ్డుపెట్టుకొని గతంలో ఎన్నికలు పోటీ చేశారన్నారు. 2014 మంచి 19 వరకు వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిగెత్తించిన ఘనత తమదేనని తెలిపారు. నీళ్లు లేని వెలుగొండ ప్రాజెక్టుకి జగన్ రిబ్బన్ కట్ చేశారని ఆరోపించారు. 2024లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి మార్కాపురం, పొదిలి ప్రాంతాలకు సాగు, త్రాగునీరు అందించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మార్కాపురం ని జిల్లా చేసే బాధ్యత తన దని హామీ ఇచ్చారు. తాతలు తండ్రులు ఇచ్చిన భూమిపై జగన్ కు హక్కు ఉందా అని ప్రశ్నించారు.