NTV Telugu Site icon

CSK vs KKR: ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను: చెన్నై కెప్టెన్

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad on Strike Rate: తన స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ తెలిపాడు. పిచ్‌ చాలా స్లోగా ఉందని, కాస్త ఆచూతుచి ఆడాల్సి వచ్చిందన్నాడు. తమ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేశారని, దాంతోనే ప్రత్యర్ధిని తక్కువే స్కోరుకే కట్టడి చేశాం అని పేర్కొన్నాడు. చెన్నై జట్టులో ఎవరికి ఎటువంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రతీ ఒక్కరికి వారి రోల్‌పై ఒక క్లారిటీ ఉందని రుతురాజ్‌ చెప్పుకొచ్చాడు. వరుసగా రెండు ఓటుములు చవిచూసిన చెన్నై తిరిగి పుంజుకుంది. సోమవారం చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ మాట్లాడుతూ… ‘విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. ఐపీఎల్‌లో నా తొలి అర్ధ సెంచరీ సాధించడం ఇంకా గుర్తుంది. అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితే. అప్పుడు ధోనీ భాయ్‌ నాతో ఉన్నాడు. ఇద్దరం కలిసి మ్యాచ్‌ను మగించాము. ఈ రోజు కూడా అలానే జరిగింది. అజింక్య రహానే గాయపడటంతో చివరి వరకు క్రీజులో ఉండటమే నా బాధ్యతగా భావించాను. పిచ్‌ చాలా స్లోగా ఉంది. సిక్సులు కొట్టే పిచ్ ఇది కాదు. స్ట్రైక్‌ రొటేట్ చేసి బౌండరీలు కొడితే.. 150-160 పరుగులు చేయొచ్చు. మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేసి ప్రత్యర్ధిని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు’ అని అన్నాడు.

Also Read: MS Dhoni: కోల్‌కతాపై చెన్నై విజయం.. ఎంఎస్ ధోనీ ఆనందం చూశారా?

‘రవీంద్ర జడేజా బంతితో మ్యాజిక్‌ చేశాడు. సహజంగా పవర్‌ప్లే తర్వాత జడ్డూ ఎటాక్‌లోకి వస్తాడు. ఇన్నేళ్లుగా మేం అనుసరిస్తున్నది అదే. చెన్నై జట్టులో ఎవరికి సూచనలు, సలహాలు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరూ గొప్ప ప్లేయర్స్ ఉన్నారు. ప్రతీ ఒక్కరికి వారి రోల్‌పై ఒక క్లారిటీ ఉంది. మహి భాయ్‌,ఫ్లెమింగ్ జట్టుతోనే ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో నా ఇన్నింగ్స్‌ను స్లోగా ఏమీ ప్రారంభించలేదు. టీ20లో మనం ఎదుర్కొనే తొలి 2-3 బంతులు చాలా ముఖ్యం. ఎందుకంటే దూకుడుగా ఆడి వికెట్‌ కోల్పోతాము. ఈరోజు కాస్త సమయం తీసుకుని ఆడా. నా స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమి మాట్లాడుకునా నేను పట్టించుకోను’ అని రుతురాజ్‌ గైక్వాడ్‌ తెలిపాడు. గైక్వాడ్‌ 58 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులు చేశాడు.