MS Dhoni: కోల్‌కతాపై చెన్నై విజయం.. ఎంఎస్ ధోనీ ఆనందం చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Celebrations after CSK Beat KKR: ఐపీఎల్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ చెలరేగింది. సొంత మైదానంలో చెన్నై ఆల్‌రౌండ్ షో ముందు కోల్‌కతా చేతులెత్తేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. రెండు వరుస ఓటముల తర్వాత విజయం సాధించడంతో చెన్నై ఆటగాళ్లు, ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం చెపాక్ మైదానం మొత్తం పసుపుమయమైంది.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విన్నింగ్ షాట్ కొట్టిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ముఖంలో సంతోషం విరబూసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు. గౌతమ్ గంభీర్, ఆండ్రీ రస్సెల్‌లతో నవ్వుతూ మాట్లాడుతూ మైదానం వీడాడు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులకే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ (34; 32 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్. రవీంద్ర జడేజా (3/18), తుషార్ దేశ్‌పాండే (3/33), ముస్తాఫిజుర్ (2/22) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్; 58 బంతుల్లో9 ఫోర్లు) రాణించగా.. శివమ్ దూబే (28; 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిశాడు.
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?