Site icon NTV Telugu

MS Dhoni: కోల్‌కతాపై చెన్నై విజయం.. ఎంఎస్ ధోనీ ఆనందం చూశారా?

Dhoni Gautam Gambhir

Dhoni Gautam Gambhir

MS Dhoni Celebrations after CSK Beat KKR: ఐపీఎల్ 2024లో హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళ్తున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ చెలరేగింది. సొంత మైదానంలో చెన్నై ఆల్‌రౌండ్‌ షో ముందు కోల్‌కతా చేతులెత్తేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. రెండు వరుస ఓటముల తర్వాత విజయం సాధించడంతో చెన్నై ఆటగాళ్లు, ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం చెపాక్ మైదానం మొత్తం పసుపుమయమైంది.

కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ విన్నింగ్ షాట్ కొట్టిన అనంతరం చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ముఖంలో సంతోషం విరబూసింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు. గౌతమ్ గంభీర్, ఆండ్రీ రస్సెల్‌లతో నవ్వుతూ మాట్లాడుతూ మైదానం వీడాడు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులకే పరిమితమైంది. శ్రేయస్‌ అయ్యర్‌ (34; 32 బంతుల్లో 3×4) టాప్‌ స్కోరర్‌. రవీంద్ర జడేజా (3/18), తుషార్‌ దేశ్‌పాండే (3/33), ముస్తాఫిజుర్‌ (2/22) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (67 నాటౌట్‌; 58 బంతుల్లో9 ఫోర్లు) రాణించగా.. శివమ్‌ దూబే (28; 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిశాడు.

Exit mobile version