MS Dhoni Record: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS DHoni complete 300 dismissals in T20 cricket: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో 300 వికెట్లలో భాగమైన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా క్యాచ్‌ను అందుకున్న మహీ.. ఈ అరుదైన ఘనతను తన పేరుపై లిఖించుకున్నాడు. 300 వికెట్లలో 213 క్యాచ్‌లు, 87 స్టంపింగ్‌లు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ, దేశవాళీ క్రికెట్లో ధోనీ ఈ ఫీట్ సాధించాడు.
ఈ జాబితాలో మరే వికెట్ కీపర్ కూడా ఎంఎస్ ధోనీకి దరిదాపుల్లో కూడా లేరు. పాకిస్తాన్ వెటరన్ కీపర్ కమ్రాన్ అక్మల్ (274), టీమిండియా వెటరన్ కీపర్ దినేశ్ కార్తీక్ (274)లు ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికా మాజీ కీపర్ క్వింటన్ డికాక్ (270), ఇంగ్లండ్ కీపర్ జోస్ బట్లర్ (209) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ధోనీ 2006 నుండి టీ20 క్రికెట్ ఆడుతున్నాడు. జోబర్గ్‌లో దక్షిణాఫ్రికాపై టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు.
Also Read
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
Also Read: MS Dhoni-Six: విశాఖలో చెలరేగిన ఎంఎస్ ధోనీ.. పండగ చేసుకున్న ఫ్యాన్స్! వైరల్ వీడియో
ఎంఎస్ ధోనీ 2007 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించిన విషయం తెలిసిందే. 2008లో ప్రారంభ సీజన్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మహీ భాగంగా ఉన్నాడు. ధోనీ చివరిసారిగా 2019లో భారత్ తరపున ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. ఐపీఎల్లో ఆడుతున్నాడు. 2024 సీజన్‌కు ముందు 42 ఏళ్ల మహీ.. చెన్నై కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. రుతురాజ్ గైక్వాడ్ జట్టు బాధ్యతలు అందుకున్నాడు.
తాజావార్తలు
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?