NTV Telugu Site icon

MS Dhoni Record: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!

Ms Dhoni Csk

Ms Dhoni Csk

MS DHoni complete 300 dismissals in T20 cricket: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో 300 వికెట్లలో భాగమైన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా క్యాచ్‌ను అందుకున్న మహీ.. ఈ అరుదైన ఘనతను తన పేరుపై లిఖించుకున్నాడు. 300 వికెట్లలో 213 క్యాచ్‌లు, 87 స్టంపింగ్‌లు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ, దేశవాళీ క్రికెట్‌లో ధోనీ ఈ ఫీట్ సాధించాడు.

ఈ జాబితాలో మరే వికెట్ కీపర్ కూడా ఎంఎస్ ధోనీకి దరిదాపుల్లో కూడా లేరు. పాకిస్తాన్ వెటరన్ కీపర్ కమ్రాన్ అక్మల్ (274), టీమిండియా వెటరన్ కీపర్ దినేశ్ కార్తీక్ (274)లు ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికా మాజీ కీపర్ క్వింటన్ డికాక్ (270), ఇంగ్లండ్ కీపర్ జోస్ బట్లర్ (209) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ధోనీ 2006 నుండి టీ20 క్రికెట్ ఆడుతున్నాడు. జోబర్గ్‌లో దక్షిణాఫ్రికాపై టీ20 ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు.

Also Read: MS Dhoni-Six: విశాఖలో చెలరేగిన ఎంఎస్ ధోనీ.. పండగ చేసుకున్న ఫ్యాన్స్! వైరల్ వీడియో

ఎంఎస్ ధోనీ 2007 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించిన విషయం తెలిసిందే. 2008లో ప్రారంభ సీజన్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మహీ భాగంగా ఉన్నాడు. ధోనీ చివరిసారిగా 2019లో భారత్ తరపున ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నా.. ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. 2024 సీజన్‌కు ముందు 42 ఏళ్ల మహీ.. చెన్నై కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. రుతురాజ్ గైక్వాడ్ జట్టు బాధ్యతలు అందుకున్నాడు.