Site icon NTV Telugu

Dhoni Fan: ధోనీని చూసేందుకు అన్ని డబ్బులు ఖర్చు చేశాడా.. మరీ ఇంత అభిమానమా..!

Dhoni Fan

Dhoni Fan

క్రికెట్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఆటగాళ్లలో కొందరు ప్రత్యేకంగా ఉంటారు. అందులో ధోనీ ఒకరు అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించి చాలా ఏళ్లు అయినప్పటికీ, కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నారు. ధోనీ టీమిండియాకు ఆడిన సమయంలో భారత్ కు మూడు ఐసీసీ ట్రోఫీలు, ఐపీఎల్ లో చెన్నై జట్టుకు ఐదు టైటిళ్లను అందించాడు. అందుకే ధోనీ అంటే క్రికెట్ అభిమానులు ఎంతో ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్ అతనికి చివరిదని తెలిసి చెన్నై జట్టు.. ఏ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆడినా, ధోనీని చూసేందుక అభిమానులు భారీగా వెళ్తున్నారు.

RR vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

అయితే.. ఓ అభిమాని పోస్ట్ చేసిన న్యూస్ వైరల్ అవుతుంది. ఏప్రిల్ 8న కోల్ కతాతో చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్ లో ధోనీని చూసేందుకు ఓ వీరాభిమాని తన కుమార్తెలతో కలిసి స్టేడియంకు వచ్చాడు. అయితే.. తాను ధోనీ కోసం మ్యాచ్ చూసేందుకు ముందుగా ఆన్‌లైన్‌లో టికెట్లు చూశానని.. దొరకలేదన్నాడు. అయితే.. బ్లాక్‌లో టికెట్లు కొన్నట్లు చెప్పాడు. దాదాపు రూ.64 వేలు పెట్టి టిక్కెట్లు కొన్నానని.. ఇంకా తన పిల్లల స్కూల్‌ ఫీజ్‌ కట్టలేదన్నాడు. అయితే, ధోనీని దగ్గరగా ఒక్కసారైనా చూడాలని భావించి అన్ని డబ్బులు పెట్టి మరీ కొన్నట్లు చెప్పాడు. మ్యాచ్ చూసేందుకు తనతో పాటు తన ముగ్గురు కుమార్తెలను తీసుకొచ్చానన్నాడు. అందుకు ఆనందంగా ఉందని ఆ అభిమాని తెలిపాడు.

BJP Manifesto: రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల.. అందరిలో ఆసక్తి..

అంతేకాకుండా.. అభిమాని కుమార్తె మాట్లాడుతూ.. టికెట్ల కోసం తమ నాన్న చాలా కష్టపడ్డాడని చెప్పింది. చివరకు టికెట్లు దొరికాయని.. ధోనీ ఆటను ప్రత్యక్షంగా చూడటం ఆనందంగా ఉందని చెప్పారు. అయితే.. ఆ వీడియోను పోస్ట్ చేసిన యూజర్‌ స్పందిస్తూ.. ‘‘ఓ తండ్రి ఇలా చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. దీన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియడం లేదు’’ అని తెలిపాడు. అతడి పోస్టుపై కొందరు కామెంట్లు చేశారు.

Exit mobile version