NTV Telugu Site icon

CSK vs MI: రహానే మెరుపు అర్థ సెంచరీ.. 10 ఓవర్లలో చెన్నై స్కోరు ఇలా..

Csk

Csk

CSK vs MI: ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ 16 సీజన్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. 158 పరుగుల ఛేదనే లక్ష్యంగా బరిలోకి దిగిన ధోనీ సేన 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. తొలి ఓవర్‌లోనే చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు షాక్ తగిలింది.. జాస‌న్ బెహ్రెండార్ఫ్ వేసిన‌ తొలి ఓవ‌ర్‌లోనే ఓపెనర్ డేవాన్ కాన్వే(0) డ‌కౌట్ అయ్యాడు. దాంతో, ఖాతా తెర‌వ‌కుండానే చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన అజింక్యా ర‌హానే(52) హాఫ్ సెంచ‌రీ బాదాడు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో ఫోర్‌తో ఫిఫ్టీకి చేరువ‌య్యాడు. క్లాస్ బ్యాటింగ్‌తో చెల‌రేగిన అత‌ను19 బంతుల్లోనే అత‌ను 6 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో యాభై ర‌న్స్ చేశాడు. ఈ సీజ‌న్‌లో వేగ‌వంత‌మైన ఫిఫ్టీ బాదాడు. అంతేకాదు సీఎస్కే త‌ర‌ఫున రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ న‌మోదు చేశాడు. 2014లో సురేశ్ రైనా 16 బంతుల్లోనే కోల్‌కతాపై హాఫ్ సెంచ‌రీ కొట్టిన సంగతి తెలిసిందే.

మళ్లీ పీయూష్ ఓవర్లోనే అజింక్యా ర‌హానే(61) ఔట‌య్యాడు. ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన అత‌ను ఆ త‌ర్వాతి బంతికి క్యాచ్ ఔట‌య్యాడు. మిడాన్‌లో సూర్యకుమార్ యాద‌వ్ క్యాచ్ ప‌ట్టడంతో వెనుదిరిగాడు. దాంతో, 82 ర‌న్స్ వ‌ద్ద చెన్నై రెండో వికెట్ ప‌డింది. రుతురాజ్ గైక్వాడ్(20), శివమ్ దుబే(11) క్రీజులో ఉన్నారు. ముంబయి బౌలర్లు పీయూష్ చావ్లా, జాస‌న్ బెహ్రెండార్ఫ్ తలో వికెట్ తీయగలిగారు.