CSK vs MI: రహానే మెరుపు అర్థ సెంచరీ.. 10 ఓవర్లలో చెన్నై స్కోరు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. 158 పరుగుల ఛేదనే లక్ష్యంగా బరిలోకి దిగిన ధోనీ సేన 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్ తగిలింది.. జాసన్ బెహ్రెండార్ఫ్ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్ డేవాన్ కాన్వే(0) డకౌట్ అయ్యాడు. దాంతో, ఖాతా తెరవకుండానే చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన అజింక్యా రహానే(52) హాఫ్ సెంచరీ బాదాడు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో ఫోర్‌తో ఫిఫ్టీకి చేరువయ్యాడు. క్లాస్ బ్యాటింగ్‌తో చెలరేగిన అతను19 బంతుల్లోనే అతను 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో యాభై రన్స్ చేశాడు. ఈ సీజన్లో వేగవంతమైన ఫిఫ్టీ బాదాడు. అంతేకాదు సీఎస్కే తరఫున రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు. 2014లో సురేశ్ రైనా 16 బంతుల్లోనే కోల్‌కతాపై హాఫ్ సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే.

Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
మళ్లీ పీయూష్ ఓవర్లోనే అజింక్యా రహానే(61) ఔటయ్యాడు. ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన అతను ఆ తర్వాతి బంతికి క్యాచ్ ఔటయ్యాడు. మిడాన్‌లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దాంతో, 82 రన్స్ వద్ద చెన్నై రెండో వికెట్ పడింది. రుతురాజ్ గైక్వాడ్(20), శివమ్ దుబే(11) క్రీజులో ఉన్నారు. ముంబయి బౌలర్లు పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్ తలో వికెట్ తీయగలిగారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!