Site icon NTV Telugu

MS Dhoni: ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై చెన్నై కోచ్‌ ఏమన్నాడంటే?

Stephen Fleming

Stephen Fleming

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో దిగువన వస్తున్న విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ పోరులో చెన్నైకి 25 బంతుల్లో 54 పరుగులు అవసరమైనపుడు 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. మహీ 11 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో చెన్నై 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మరీ దిగువన వస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై హెడ్ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ స్పందించాడు.

Also Read: IPL 2025: ఐపీఎల్‌లో రికార్డు నెలకొల్పిన ముంబై ఇండియన్స్‌!

మోకాలి సమస్య కారణంగా ఎంఎస్ ధోనీ పరుగెత్తుతూ 10 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయలేడని స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ చెప్పాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ… ‘ఎంఎస్ ధోనీ శరీరం, మోకాళ్లు ఒకప్పటిలా లేవు. అతడు మైదానంలో బాగానే కదులుతున్నాడు కానీ 10 ఓవర్ల పాటు పరుగెడుతూ బ్యాటింగ్‌ చేయలేడు. తానేం ఇవ్వగలడో మహీనే అంచనా వేసుకుంటాడు. మ్యాచ్‌ సమతూకంలో ఉంటే కాస్త ముందు బ్యాటింగ్‌కు వస్తాడు. కొన్ని పరిస్థితులలో వేరే ఆటగాళ్లకు అవకాశమిస్తాడు. నేను గతంలో చెప్పను, మరోసారి చెబుతున్నా.. ధోనీ మాకు చాలా విలువైన ఆటగాడు. మహీ కీపింగ్, నాయకత్వం మాకు చాలా అవసరం’ అని చెప్పాడు.

Exit mobile version