NTV Telugu Site icon

CEO Kashi Viswanathan: ధోనీ ఐపీఎల్ 2025లో ఆడుతాడని ఆశిస్తున్నాం..

Kasi

Kasi

చెన్నై సూపర్‌కింగ్స్‌ మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఎంఎస్‌ ధోనికి ఐపీఎల్‌ 2024 సీజనే చివరిదని చాలా వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ధోని తన చివరి మ్యాచ్‌ను ఆర్సీబీతోనేనని అనేక నివేదికలు పేర్కొన్నాయి. అయితే.. ఆర్సీబీతో మ్యాచ్ తర్వాత, ధోని రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. ఐపీఎల్ 2024లో చివరి మ్యాచ్ అయిపోగానే మరుసటి రోజు ధోనీ రాంచీకి వెళ్లాడు. ఇదిలా ఉంటే.. ధోనీ రిటైర్మెంట్‌పై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ బిగ్ అప్ డేట్ ఇచ్చారు.

Swati maliwal: పాలిగ్రాఫ్ టెస్ట్‌ కోసం పోలీసులకు రిక్వెస్ట్.. కారణమిదే!

కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ‘ధోని మాకు ఏమీ చెప్పలేదు. ఈ సీజన్‌లో అతను బ్యాటింగ్ చేసిన విధానం, అతను ఖచ్చితంగా ఆటను కొనసాగించగలడు, అయితే అదంతా అతనిపై ఆధారపడి ఉంటుంది. ధోనీ మాకు అలాంటి విషయాలు చెప్పడు, ధోనీనే నిర్ణయం తీసుకుంటాడు.’ అని చెప్పారు.

Arvind Kejriwal: కావాలనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలేదు..

ఇదిలా ఉంటే.. మహేంద్ర సింగ్ ధోనీ ఇంతకుముందు అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆ సమయంలో ధోని తన రిటైర్మెంట్ గురించి సన్నిహితులకు తప్ప ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు కూడా ధోనీ రిటైర్మెంట్ ఇలాగే కనిపిస్తోంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి ధోని రిటైర్‌మెంట్ తీసుకోవలసి వస్తే, తన చివరి లీగ్ మ్యాచ్ తర్వాత దానిని ప్రకటించి ఉండవచ్చు.. కానీ ధోనీ అలా చేయలేదు. దీంతో.. అభిమానులు ధోనీ ఐపీఎల్ 2025 ఆడుతాడని ఆశను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఐపీఎల్ 2025లో కూడా ధోని తన మ్యాజిక్‌ను మైదానంలో అభిమానులకు చూపించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024లో 14 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 14 ఫోర్లు, 13 సిక్సర్లతో 161 పరుగులు చేశాడు.