MS Dhoni: ఐపీఎల్లో ధోని ఆడటంపై అనుమానాలు.. సీఎస్కే ఏం చెప్పిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సీఎస్కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగా కొనసాగడంపై సీఎస్కే యాజమాన్యం ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి ధోని అందుబాటులో ఉంటాడని ఆ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం పేర్కొన్నారు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు చాలా మందికి ముందే తెలుసింది.. కానీ, నాకు మాత్రం ఆలస్యంగా తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. ధోని ఏ నిర్ణయం తీసుకున్నా తాము గౌరవిస్తాం.. అది తమ జట్టుకు మంచే చేస్తుందని కాశీ విశ్వనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక, ఆర్సీబీతో సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ధోని గత సీజన్లో కంటే ఈ సీజన్లోనే ఎక్కువ ఫిట్‌గా కనిపిస్తున్నాడన్నారు. ధోని ఈ సీజన్‌తో పాటు మున్ముందు మరిన్ని సీజన్లలోనూ సీఎస్కేతోనే ఉంటాడని పేర్కొన్నారు. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో సీఎస్కే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. కెప్టెన్సీ విషయాన్ని ధోని తనకు గత సీజన్‌కు ముందు చెప్పాడని పేర్కొన్నారు. కెప్టెన్సీ చేపట్టే విషయంలో ధోని తనలో మానసిక స్థైర్యాన్ని నింపాడని గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
Also Read
Read Also: KS. Eshwarappa: ప్రధాని చెప్పినా నా నిర్ణయం మారదు.. విజయం మాదే..
అయితే, ఐపీఎల్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రుతురాజ్ బాధ్యతలను తీసుకున్నారు. మరికొద్ది గంటల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ఆడనుంది.
CSK CEO confirms Dhoni will play IPL 2024 entirely. [Cricbuzz] pic.twitter.com/RCy4sGWK8I
— Johns. (@CricCrazyJohns) March 21, 2024
~ the greatest trio ever to exist!🦁❤️#ChennaiSuperKings pic.twitter.com/lkoHiksQUh
— Hustler (@HustlerCSK) March 21, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు