NTV Telugu Site icon

MS Dhoni: ఐపీఎల్లో ధోని ఆడటంపై అనుమానాలు.. సీఎస్కే ఏం చెప్పిందంటే..?

Ms Dhoni

Ms Dhoni

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో సీఎస్‌కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగా కొనసాగడంపై సీఎస్కే యాజమాన్యం ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చింది. ఐపీఎల్‌ 2024 సీజన్‌ మొత్తానికి ధోని అందుబాటులో ఉంటాడని ఆ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్‌ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సీఎస్‌కే హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ సైతం పేర్కొన్నారు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు చాలా మందికి ముందే తెలుసింది.. కానీ, నాకు మాత్రం ఆలస్యంగా తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. ధోని ఏ నిర్ణయం తీసుకున్నా తాము గౌరవిస్తాం.. అది తమ జట్టుకు మంచే చేస్తుందని కాశీ విశ్వనాథ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.


ఇక, ఆర్సీబీతో సీజన్‌ తొలి మ్యాచ్‌ ప్రారంభానికి కొద్ది గంటల ముందు సీఎస్‌కే కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ.. ధోని గత సీజన్‌లో కంటే ఈ సీజన్‌లోనే ఎక్కువ ఫిట్‌గా కనిపిస్తున్నాడన్నారు. ధోని ఈ సీజన్‌తో పాటు మున్ముందు మరిన్ని సీజన్లలోనూ సీఎస్‌కేతోనే ఉంటాడని పేర్కొన్నారు. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో సీఎస్‌కే కొత్త కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మాట్లాడుతూ.. కెప్టెన్సీ విషయాన్ని ధోని తనకు గత సీజన్‌కు ముందు చెప్పాడని పేర్కొన్నారు. కెప్టెన్సీ చేపట్టే విషయంలో ధోని తనలో మానసిక స్థైర్యాన్ని నింపాడని గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.

Read Also: KS. Eshwarappa: ప్రధాని చెప్పినా నా నిర్ణయం మారదు.. విజయం మాదే..

అయితే, ఐపీఎల్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ కొత్త కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. మాజీ కెప్టెన్‌ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రుతురాజ్‌ బాధ్యతలను తీసుకున్నారు. మరికొద్ది గంటల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌ 2024 సీజన్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.