Site icon NTV Telugu

CSK Biryani Party: తెలుగోడి ఆతిథ్యం అంటే ఆ మాత్రం ఉంటది బాసూ.. బిర్యానీ పార్టీలో పాల్గొన్న ఆటగాళ్లు..!

4

4

హైదరాబాద్.. ఈ మహానగరం పేరు చెప్పగానే గుర్తొచ్చేటివి చార్మినార్., ఆ తర్వాత దమ్ బిర్యాని. హైదరాబాద్ కు వచ్చామంటే అక్కడ లభించే దమ్ బిర్యాని తినకుండా వెళ్లేవారు చాలా తక్కువ. హైదరాబాదులో వండే దమ్ బిర్యాని ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకుంది. విదేశీయులు ఎవరైనా హైదరాబాద్ కు వచ్చిన సమయంలో కూడా బిర్యాని టేస్ట్ చేయకుండా వెళ్ళరు. ఇకపోతే నేడు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇకపోతే, హైదరాబాదులో దొరికే గుమగుమలాడే బిర్యానీ ఆరగించి వావ్ అంటున్నారు చెన్నై ఆటగాళ్లు. టీమిండియా మాజీ ఆటగాడు., చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబంటి రాయుడు ఈపార్టీకి ఆతిథ్యం ఇచ్చాడు.

Also read: Docter MLA: మహిళ కడుపులోని 10 కిలోల కణితిని తొలగించిన ఎమ్మెల్యే డాక్టర్..!

తెలుగు రసాలకు సంబంధించి అంతర్జాతీయ ఆటగాళ్లలో ఒకడైన అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులైన రవీంద్ర రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, దీపక్ చాహర్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ చౌదరి లాంటి ఆటగాళ్ల తోపాటు టీం స్టాఫ్ కు కూడా బిర్యానీ పార్టీను ఇచ్చి అక్కడ కొద్దిసేపు సందడి చేశాడు. ఈ పార్టీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో కు ‘బిర్యానీ సూపర్ కుటుంబం’ అని క్యాప్షన్ చేసింది.

Also read:Ajith Natarajan Birthday: నట్టు బర్త్ డే పార్టీకి వచ్చి సడన్ సప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో..!

ఇక ఈ పార్టీ తర్వాత కొందరు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు హైదరాబాద్ లోని ప్రముఖ దర్శనీయ స్థలాలను చుట్టేశారు. ట్యాంక్ బండ్, చార్మినార్ లాంటి ఇతర ప్రముఖ ప్రదేశాలను చెన్నై ఆటగాళ్లు సరదాగా వెళ్లి ఆనందించారు. అనంతరం వారు దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇకపోతే నేడు రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రాత్రి 7:30 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది.

Exit mobile version