CS Somesh Kumar : తెలంగాణలో స్వాతంత్ర భారత వజ్రోత్సవాలపై సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CS Somesh Kumar Review Meeting on India Diamond Jubilee Independence Day Celebrations in Telangana.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహణపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. బీ.ఆర్.కే.ఆర్ భవన్ లో స్వాతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై నేడు ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. వజ్రోత్సవ ఉత్సవాలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇప్పటికే రోజువారీ కార్యక్రమాలను రూపొందించిందని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
- Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్‌పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్‌కే ఛాన్స్!
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- India vs Afghanistan: భారత్‌తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
ఆగస్టు 8వ తేదీన జరిగే ప్రారంభోత్సవ సభకు మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు. దేశ సమైక్యతా, దేశ భక్తి ని పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ పంపిణీ చేసేందుకు ఇప్పటికే కోటి జెండాలను సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో జెండాలు పంపిణీ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా అన్ని సినిమా థియేటర్లలో పాఠశాల విద్యార్థులకు జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే చలన చిత్రాలను ఉచితంగా ప్రదర్శించనున్నట్టు వివరించారు.
తాజావార్తలు
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
-
Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్‌పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్‌కే ఛాన్స్!
-
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్‌తో నవ్వులే నవ్వులు!
-
FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!