మోడీ పర్యటనపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని సీఎస్ కోరారు. పోలీసు శాఖ బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. తగినన్ని అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. వైద్య సిబ్బంది, అంబులెన్స్, ఇతర సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలన్నారు.
Also Read : Jagan Mohan Reddy: మీరూ.. నేనూ అంతా కలిసి అలా ముందుకెళదాం
అన్ని వేదికల వద్ద అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తేలియజేశారు. డీజీపీ అంజనీకుమార్, సీనియర్ పోలీసు అధికారులు, రైల్వే సహా వివిధ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ ఈనెల 8వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనున్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్-తిరుపతి వరకు నడిచే రెండో వందే భారత్ రైలును అదే రోజున మోడీ ప్రారంభించనున్నారు.
Also Read : Pushpa 2: బన్నీ ఫ్యాన్స్ అసెంబుల్.. అప్డేట్ రావడమే ఆలస్యం రచ్చ చేయడమే
